ఆనందంగా హనీమూన్.. ఆపై విషాదం.. పెళ్ళైన 20రోజుల్లోపే ప్రమాదంలో నవ వరుడు మృతి

పెళ్ళిచూపుల్లో వారిద్దరు ఒకరినిఒకరు ఇష్టపడ్డారు. పెద్దలు కుదిర్చిన ఈ జంట పెళ్లి చేసుకున్నారు. మేళతాళాల మధ్య, వేద మంత్రాల మధ్య ఇద్దరు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి చూడటానికి వచ్చిన వారంతా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా చూడముచ్చటగా జంట ఉన్నారని చెప్పుకున్నారు.

ఒకరిని ఒకరు ఇష్టపడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఎన్నోకలలతో ప్రారంభించిన వైవాహిక జీవితం ఆదిలోనే విషాదంగా మారింది. తన జీవిత భాగస్వామిని గురించి ఎన్నో కలలు కన్న వధువు కలలు కల్లలుగా మారాయి. ఊహించని ఘటన వరుడి ప్రాణాలు తీయడంతో, వధువు కన్నీరుమున్నీరుగా రోదిస్తుంది.

పెళ్లయి 20 రోజులైనా కాకముందే.. రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి

పెళ్లయి 20 రోజులైనా కాకముందే.. రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి

పెళ్లయి 20 రోజులైనా కాకముందే, హనీమూన్ కి వెళ్లి వస్తున్న జంట రోడ్డు ప్రమాదానికి గురికాగా వరుడు మృతి చెందిన సంఘటన కర్ణాటక రాష్ట్రం హావేరి జిల్లాలో చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే దావణగెరె జిల్లా హరిహర తాలూకా జగళి గ్రామానికి చెందిన మఠం శోభా రాజయ్య దంపతుల కుమారుడు 28 సంవత్సరాల సంజయ్ , బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఈ సంవత్సరం నవంబర్ 28 వ తేదీన బైలహోంగలకు చెందిన టెక్కీ ప్రీతితో, సంజయ్ కు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.

ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుని ఇంటికి వస్తుండగా ప్రమాదం

ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుని ఇంటికి వస్తుండగా ప్రమాదం

ఇక బెంగళూరులో కాపురం ఉండడానికి అద్దెకు ఇంటిని కూడా చూసుకున్నారు. డిసెంబర్ 12వ తేదీన ఆ అద్దె ఇంట్లో చేరాల్సి ఉంది. అయితే ఈ లోపు పెళ్లయిన కొత్త జంట హనీమూన్ కోసం వెళ్లారు. తమ దగ్గర లోని అన్ని ప్రాంతాలను చూస్తూ, వారు వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. ఇంతలో ఊహించని ఘటన వారికి ఎదురైంది. సిగందూరు చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకుని, అనంతరం శిరసి మారికాంబ దేవిని దర్శించుకుని సంజయ్ ప్రీతి లు తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వారి ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది.

రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి. వధువు కన్నీరు మున్నీరు

రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి. వధువు కన్నీరు మున్నీరు

ప్రీతి, సంజయ్ ప్రయాణిస్తున్న వాహనం ఒక ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారిని దగ్గరలో ఉన్న రాణే బెన్నూరు హాస్పిటల్ కు తరలించారు.

అక్కడ నుండి దవణగారె ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సంజయ్ మృతిచెందాడు. దీంతో భర్త మరణం తట్టుకోలేక ప్రీతి కన్నీరు మున్నీరుగా రోదిస్తుంది. పెళ్లయి పట్టుమని 20 రోజులైనా కాకముందే నవ వరుడు మృతిచెందడంతో వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+