కేజ్రీవాల్ పక్క సెల్ లలో కరడుగట్టిన నేరగాళ్ళు.. ఎవరో తెలిస్తే వణికిపోతారు!!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ మనీ లాండరింగ్ ఆరోపణలు చేసి ప్రధాన సూత్రధారిగా పేర్కొన్న అరవింద్ కేజ్రివాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. నిన్న అరవింద్ కేజ్రీవాల్ ను కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ కు జైలు నెంబరు రెండును కేటాయించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉండనున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ పక్క సెల్ లలో కరడుగట్టిన నేరగాళ్ళు
అయితే అరవింద్ కేజ్రీవాల్ ఉన్న జైలులో ఆయన పక్క సెల్ లలో ఉన్నవారు ఎవరు అనేది తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ జైలు నెంబర్ 2 లో ఉండగా ఆయన పక్క సెల్ లలో అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ నీరజ్ బవానా, ఉగ్రవాది జియావుర్ రెహమాన్ ఉన్నారు.

Hardened criminals chota rajan gangster neeraj bavana in tihar jail cells next to Kejriwal

కేజ్రీవాల్ పక్క సెల్ లో ఛోటా రాజన్
ఛోటా రాజన్ ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం కు సన్నిహితుడు . దావూద్ ఇబ్రహీంకు తీవ్ర ప్రత్యర్థిగా మారడానికి ముందు సన్నిహితుడుగా ఉన్నాడు. దావూద్ ఇబ్రహీం కు చెందిన డీ కంపెనీతో విభేదించి స్వతంత్రంగా ఒక ముఠాను ఏర్పరచుకున్న ఛోటా రాజన్. కరడు కట్టిన నేరస్తుడు. చోటా రాజన్ 2018లో జర్నలిస్టు j.డే హత్య కేసులో దోషిగా నిర్ధారించబడి జీవితఖైదు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం అతను కేజ్రీవాల్ పక్క సెల్లో ఉన్నారు .

కేజ్రీవాల్ కు దగ్గరలోనే ఆ ఉగ్రవాది కూడా
కేజ్రివాల్ పక్క సెల్లో ఉన్న మరొక పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా, అతనిపై 40కి పైగా హత్య, హత్యాయత్నం మరియు దోపిడీ కేసులు ఉన్నాయి. అతను కూడా కేజ్రీవాల్ పక్క సెల్ లోనే ఉండడం గమనార్హం. ఇంకా కేజ్రీవాల్ సెల్ కు సమీపంలో ఉన్న మరొక సెల్ లో జియావుర్ రెహ్మాన్ ఇండియన్ ముజాహిదీన్ (IM) ఉగ్రవాది ఉన్నారు.

తీవ్ర నేరాలు చేసిన వారి పక్కనే కేజ్రీవాల్
తీవ్రమైన నేరాలు చేసిన ఇంతమంది ఉన్న జైలులో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నిందితుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఉంచారు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మాజీ డిప్యూటీ సీఎం మనీషా సిసోడియా జైలు నెంబర్ ఒకటి లో ఉండగా, ఎమ్మెల్సీ కవిత మహిళా జైలులో జైలు నెంబర్ 6లో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+