కాన్ఫిడెన్స్ లెవెల్స్ అద్దిరింది..!!
Jammu Kashmir Assembly Election Results 2024: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఈ రెండు చోట్లా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. మధ్యాహ్నానికి ఓ స్పష్టత ఏర్పడుతుంది.
జమ్మూ కాశ్మీర్‌లో పదేళ్లుగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగలేదనే విషయం తెలిసిందే. చివరి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. 2018 జులైలో అసెంబ్లీ రద్దయింది. ఆ మరుసటి ఏడాదే కేంద్ర ప్రభుత్వం.. ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్, లఢక్‌గా విభజించింది. ఈ రెండింటినీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.

ఆ తరువాత మళ్లీ ఇక్కడ ఎన్నికలను నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీ అధికారాన్ని అందుకుంటుందనేది ఆసక్తిగా మారింది. నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మధ్య ఇక్కడ ప్రధానంగా పోటీ నెలకొంది.
ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో పాగా వేసేదెవరనే విషయంపై ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా జమ్మూ కాశ్మీర్‌లో హంగ్ ఏర్పడుతుందనే అంచనాలను వ్యక్తం చేశాయి. ఇక వాస్తవ ఫలితాలు ఎలా ఉండబోతోన్నాయనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.

ఇక హర్యానాలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ- జన్‌నాయక్ జనతా పార్టీ సంకీర్ణ కూటమికి ఓటమి తప్పదంటూ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవా వీస్తుందని అంచనా వేశాయి. 70 సీట్లను తాము గెలుచుకోబోతున్నామంటూ తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కైథల్ అభ్యర్థి ఆదిత్య సూర్జేవాలా ధీమా వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల మధ్య దేశ రాజధానిలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటోన్నారు. వాళ్ల రాకతో పార్టీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఫొటోలను ముద్రించిన టీషర్టులు ధరించి భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. డోలు మోగిస్తూ సందడి చేస్తోన్నారు.













Click it and Unblock the Notifications