హర్యానా ఓట్ల లెక్కింపు తీరుపై కాంగ్రెస్‌లో అనుమానాలు?
Haryana Assembly Election Results 2024: ఓట్ల లెక్కింపు సందర్భంగా హర్యానాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కౌటింగ్ కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. చేదు ఫలితాలు ఎదురవుతోన్నాయి. మొదట్లో సాధించిన భారీ ఆధిక్యత కాస్తా కొట్టుకుపోయింది. వెనుకంజలో పడింది.
ఇటీవలే జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. కాశ్మీర్‌లో మూడు దశల్లో హర్యానాలో ఈ నెల 5వ తేదీన ఒకే విడతలో 90 చొప్పున నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. తాజాగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది.

ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే తొలి గంటలో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ- దూసుకెళ్లింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేేసే దిశగా అడుగులు వేసింది. తొలి గంటలోనే భారీ మెజారిటీని సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొత్తం 71 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తెరిచిన తరువాత ఫలితాలు తారుమారు అయ్యాయి. బీజేపీ ఒక్క ఉదుటున ఆధిక్యతను సాధించింది. ఈవీఎంలల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆధిక్యత భారీగా తగ్గుతూ వచ్చింది. వెనుకంజలో నిలిచింది. పోటీ ఇవ్వలేని స్థితిలో కనిపించిన బీజేపీ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది.
మధ్యాహ్నం 12 గంటల సమయానికి బీజేపీ 50, కాంగ్రెస్ 35 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో నిలిచాయి. ఇండిపెండెంట్లు మూడు చోట్ల, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, బహుజన్ సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులు ఒక్కో సీటులో లీడింగ్‌లో కనిపించారు. జన్‌నాయక్ జనతా పార్టీ ఖాతా తెరవలేకపోయింది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు 11 నుంచి 12 రౌండ్ల వరకు పూర్తయినప్పటికీ- కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం అధికారికంగా ప్రకటించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటూ వచ్చింది. అయిదారు రౌండ్ల వరకే అంటే సగం వరకు మాత్రమే డేటా ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటోంది.

దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తరహాలోనే ఈసీ ఇప్పుడు హర్యానా విషయంలో వ్యవహరిస్తోందని మండిపడింది. ఈసీపై బీజేపీ అగ్ర నాయకులు తీవ్ర ఒత్తిళ్లను తీసుకొస్తోన్నారని, ఫలితాలను తారుమారు చేయడానికే ఈ మైండ్‌గేమ్‌ను అనుసరిస్తోందంటూ ఆరోపించింది.
దీనిపై తాము కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కలుస్తామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈసీ సిబ్బందే ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తోన్నారని, వాటిని క్రోడీకరించి వెబ్‌సైట్‌లో ఎందుకు ఎప్పటికప్పుడు పొందుపర్చట్లేదని ఆయన ప్రశ్నించారు.
11 నుంచి 12 రౌండ్ల లెక్కింపు పూర్తవుతున్నప్పటికీ వెబ్‌సైట్‌లో ఈసీ పొందుపరుస్తోన్న డేటా మాత్రం ఇంకా అయిదో రౌండ్ వద్దే ఉంటోందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు. దీని వెనుక బీజేపీ ప్రమేయం ఉందని తాము భావిస్తోన్నామని స్పష్టం చేశారు. తమ అభ్యంతరాలను ఈసీకి తెలియజేస్తామని పేర్కొన్నారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications