ప్రాణాలమీదికి తెచ్చిన సెల్ఫీ పీక్.. బియాస్ నదిలో పడ్డ యువకుడు..
సిమ్లా : సెల్ఫీ పిచ్చితో ఎన్ని ఘటనలు జరుగుతున్న యువత వైఖరిలో మార్పు రావడం లేదు. కొన్ని ఘటనల్లో చనిపోతున్నా మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సెల్ఫీల కోసం ఆరాట పడొద్దని .. పిచ్చి స్టంట్లు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్న పట్టించుకోవడం లేదు. తాజాగా బియాస్ నది ఒడ్డున సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు యువకుడు. సెల్ఫీ తెచ్చిన తంటాతో కాసేపు ఊపిరి ఆగిపోయినంత పనైంది ఆ యువకుడికి.
సెల్ఫీ కోసం ట్రై చేసి ..
రెవరికి చెందిన లలిత్ యాదవ్‌కు చదువుకుంటున్నాడు. కానీ అతనికి సెల్ఫీలంటే పిచ్చి.. చిత్ర, విచిత్రంగా సెల్ఫీల కోసం ట్రై చేస్తుంటాడు. ఇవాళ కూడా హిమాచల్ ప్రదేశ్ మనాలీ వద్ద గల బియాస్ నది వద్ద సెల్ఫీ కోసం ట్రై చేశాడు. అయితే అదుపుతప్పి నదిలో పడిపోయాడు. దీంతో అక్కడున్న వారు వెంటనే అలర్టయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో కొట్టుకుపోయిన లలిత్‌ను కాపాడినట్టు పోలీసులు తెలిపారు. గాయం కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు.

ఈశాన్య భారతదేశంలో వర్షాలు కురుస్తోన్నాయి. దీనికి తోడ వరద నీటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో నది సమీపంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు అయినా పట్టించుకోక .. సెల్ఫీ కోసం ట్రై చేసి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు లలిత్ యాదవ్. యువత దూకుడు నేపథ్యంలో పరిసరాల్లో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.












Click it and Unblock the Notifications