Vinesh Phogat: వినేష్ ఫోగట్ అరంగేట్రం అదుర్స్-తొలి ఎన్నికల్లో 5763 మెజార్టీతో గెలుపు..!

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అత్యంత చర్చనీయాంశమైన అంశాల్లో వినేష్ ఫోగట్ కూడా ఒకరు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వేధింపులపై ఢిల్లీలో నిరసనకు దిగి గతంలో జాతీయ స్ధాయిలో చర్చనీయాంశమైన వినేష్.. తాజాగా పారిస్ ఒలింపిక్స్ లో 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నందున ఫైనల్ వరకూ వెళ్లినా నిరాశ తప్పలేదు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి వెంటనే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.

పారిస్ ఒలింపిక్స్ లో పరాభవం నేపథ్యంలో వినేష్ ఫోగట్ ను పార్టీలో చేర్చుకుని హర్యానా ఎన్నికల్లో జులానా సీటు నుంచి బరిలోకి దింపిన కాంగ్రెస్ పార్టీ.. భారీ ప్రయోజనమే ఆశించింది. అప్పటికే బీజేపీపై అసంతృప్తిగా ఉన్న జాట్లను పూర్తిగా తమవైపు తిప్పుకోవచ్చని భావించిన కాంగ్రెస్ పార్టీ.. జులానాలో వినేష్ ఫోగట్ కు సీటు ఇచ్చింది. అయితే తన బంధువర్గం ఎక్కువగా ఉన్న జులానాలో బరిలోకి దిగిన ఫోగట్ 5763 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్ది యోగేష్ కుమార్ ను ఓడించారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 19 ఏళ్ల తర్వాత గెలిచింది.

Haryana Results 2024 wrestler vinesh phogat win julana election by 5763 votes

జూలానా సీటు నుంచి ఫోగట్ ను బరిలోకి దింపడంపై తొలుత విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్.. ఇది దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఓ మేటి క్రీడాకారిణికి ఇచ్చిన గౌరవంగా ప్రకటించింది. దీంతో పాటు జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ సీటులో ఫోగట్ సునాయాసంగా గెలవాల్సి ఉంది. కానీ బీజేపీతో పాటు ఇతర కూటముల అభ్యర్ధులు కూడా రంగంలో నిలవడంతో ఫోగట్ కేవలం 5700 ఓట్ల మెజార్టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతే కాదు ఇతర సీట్లపైనా ఆమె ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+