Insurance: రూ.456 తో రెండు బీమా పథకాల్లో చేరొచ్చు..
మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరి ప్రాణాలకు గ్యారెంటీ లేదు. అందుకే ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే దేశంలో అందరికి ఇన్సూరెన్స్ తీసుకునేంతా స్తోమత ఉండదు. అందుకే కేంద్ర ప్రభుత్వమే రెండు బీమా పథకాలు తీసుకొచ్చింది. ఈ పథకాలకు మనం నామమాత్రపు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. కేంద్రం తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ పథకాల్లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)ఉన్నాయి.
రెండు పథకాల ప్రీమియం చెల్లింపులు మేలోనే చేయాలి. అందుకే బ్యాంక్ అకౌంట్ లో మే నెలలో రూ.456 ఉంచుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ స్కీమ్ ల్లో చేరిన వారు మే 31 లోపు తమ బ్యాంక్ ఖాతాలో తప్పకుండా రూ. 456 ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పీఎమ్‌జేజేబీవై అనేది వన్ ఇయర్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ స్కీమ్ కింద రూ. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ ఇన్సూరెన్స్ పథకంలో 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్నవారు తీసుకోవచ్చు.

ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ప్రీమియం సంవత్సరానికి రూ.436 చెల్లించాలి. ఈ కవరేజ్ జూన్ 1 నుంచి మే 31 స్కీమ్ కవరేజ్ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లను 8 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టారు. వీటి ప్రీమియంలు కూడా పెరిగాయి. గతంలో పీఎంజేజేబీ స్కీమ్ కోసం ప్రీమియం రూ. 330 మాత్రమే ఉండేది, అది ఇప్పుడు రూ. 436 కి పెరిగింది. అదే సమయంలో పీఎంఎస్‌బీ ప్రీమియం రూ. 12 నుంచి రూ. 20 కి పెంచారు.
ఇక ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. అంటే ప్రమాదవ శాత్తు పాలసీదారుడు చనిపోతే వారి కుటుంబాలకు నిర్దిష్ట అమౌంట్ వస్తుంది. ఒక వేళా ప్రమాదంలో అంగవైకల్యం సంభవించినా కూడా పాలసీ డబ్బులు లభిస్తాయి. ఈ స్కీమ్‌లో చేరిన వారు ఏడాదికి కేవలం రూ. 20 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రెండు పథకాల కింద అంటు రూ.436, రూ.20 మొత్తం రూ.456 ఖాతాలో ఉండేట్లు చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications