ఢిల్లీలో భారీ పేలుళ్లలో గుండెను పిండేసే దృశ్యాలు

భారత రాజధాని ఢిల్లీలో జరిగిన అత్యంత భయంకరమైన పేలుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో మృతుల సంఖ్య, గాయపడిన వారి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడు ధాటికి ఏకంగా 9 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బ్లాస్ట్ తీవ్రత ఎంతలా ఉందంటే, మృతుల శరీర భాగాలు ఛిద్రమై కనిపిస్తున్నాయి.
ఈ దృశ్యాలు గుండెను పిండేస్తున్నాయి. ఈ దాడిలో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

Heart-wrenching scenes of massive explosions in Delhi

మరోవైపు, పేలుడు జరిగిన ప్రాంతంలో 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై, భయానక వాతావరణం నెలకొంది. ఈ దాడి వెనుక కారణాలపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఎన్ఐఏ ,ఎన్ఎస్జీ బృందాలు చేరుకున్నాయి.

ముంబై, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో హై అలర్ట్
ఢిల్లీలో పేలుడు ఘటన జరిగిన వెంటనే, దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముంబై, హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాలు , ముఖ్యమైన ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు , భద్రతా బలగాలు గట్టి నిఘా ఉంచాయి. ఈ ఘటన దేశ భద్రతకు పెను సవాల్ విసిరింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన అధికారిక వివరాలు , దాడికి కారణమైన వారిపై త్వరలో చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+