అల్పపీడన ప్రభావంతో విరుచుకుపడ్డ వర్షం. రాజధానికి ఎల్లో అలర్ట్

దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచే ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఢిల్లీ వాసులకు ఈ వర్షం పలకరించడంతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడన వ్యవస్థ ఈస్ట్-నార్త్ ఈస్ట్ దిశగా పయనించే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఢిల్లీ పరిధిలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

పడిపోయిన ఉష్ణోగ్రతలు.. రోడ్లపైకి వస్తున్న ప్రజలు

ఆదివారం కురిసిన వర్షానికి ఢిల్లీలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా కిందకు పడిపోయాయి. సఫ్దర్‌జంగ్ వెదర్ స్టేషన్ రికార్డుల ప్రకారం గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.5 డిగ్రీలు తగ్గి 27.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా ఉంది. గత 24 గంటల్లో ఏకంగా 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గాలిలో తేమ శాతం 98కి చేరింది. చల్లటి ఈనెల గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు, పిల్లలు వర్షంలో తడుస్తూ సరదాగా గడుపుతున్నారు.

Heavy Rain Lashes Delhi-NCR IMD Forecasts Rain Spell Across Capital CM Rekha Gupta Inspects Drainage
కుండపోత వర్షాలు: ఉక్కపోత నుంచి బిగ్ రిలీఫ్..
కుండపోత వర్షాలు: ఉక్కపోత నుంచి బిగ్ రిలీఫ్..

జలమయమైన పలు ప్రాంతాలు.. వాహనదారులకు ఇబ్బందులు

ఒకవైపు వర్షం హాయినిచ్చినప్పటికీ, మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. గీతా కాలనీ, అక్బర్ రోడ్, గుర్గావ్ వ్యాప్తంగా ప్రధాన రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరింది. రోడ్లపై డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. గురుగ్రామ్‌ ప్రధాన రహదారుల్లో మోకాలు లోతు నీరు నిలవడంతో రాకపోకలు నెమ్మదించాయి.

Viral Video: గంటసేపు వర్షానికే చెరువైన ఢిల్లీ ఎయిర్ పోర్టు..!
Viral Video: గంటసేపు వర్షానికే చెరువైన ఢిల్లీ ఎయిర్ పోర్టు..!

క్షేత్రస్థాయికి ముఖ్యమంత్రి.. అధికారులకు కీలక ఆదేశాలు!

వర్షాల ధాటికి నగరంలో తలెత్తిన జలమయ సమస్యను పరిశీలించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వయంగా రంగంలోకి దిగారు. సద్భావన పార్క్, దానికి ఆనుకుని ఉన్న రహదారుల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో డ్రైనేజీ ఏర్పాట్లను, పారిశుధ్య పనులను దగ్గరుండి పరిశీలించారు. డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉన్న చోట్ల వెంటనే మోటార్ పంపులను ఏర్పాటు చేసి వర్షపు నీటిని బయటకు పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+