Viral Video: గంటసేపు వర్షానికే చెరువైన ఢిల్లీ ఎయిర్ పోర్టు..!
ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో కురిసిన భారీ వర్షం (Delhi Rain) రాజధాని వాసులకు చుక్కలు చూపించింది. భారీ వర్షం కారణంగా జాతీయ రాజధానిలో విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు నగరంలో వీధులన్నీ జలమయం అయ్యాయి. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాల్ని దారి మళ్లించాల్సి వచ్చింది. అలాగే నగరంలోనూ వివిధ ప్రాంతాల్లో జన జీవనంపై తీవ్ర ప్రభావం పడింది.
ఇవాళ మధ్యాహ్నం 3:30 నుండి 4:30 గంటల మధ్య కురిసిన భారీ వర్షం కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొత్తం తొమ్మిది విమానాలను దారి మళ్లించారు. నాలుగు విమానాలను జైపూర్‌కు, మరో నాలుగు లక్నోకు, ఒక విమానాన్ని అహ్మదాబాద్‌కు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇందిరాగాంధీ విమానాశ్రయంలో భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో ఆ నీటిలోనే ప్రయాణికులు అటు ఇటూ తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్నాయి. ఢిల్లీలో భారీ వర్షంపై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

#WATCH | Delhi: Waterlogging witnessed at Indira Gandhi International Airport after heavy rainfall lashed the national capital. pic.twitter.com/vejJpM2W2l
— ANI (@ANI) September 4, 2026
మరోవైపు భారీ వర్షంతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిలిచిపోయిన నీటిని కొద్దిసేపటికే తొలగించినట్లు, విమానాశ్రయ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల మధ్య పాలం ప్రాంతంలో అత్యధికంగా 72.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది ఆ సమయంలో రాజధానిలో నమోదైన అత్యధిక వర్షపాతంగా నిలిచింది.














Click it and Unblock the Notifications