రేవంత్ తో ఇక అమీ తుమీ , ఢిల్లీలో తేల్చేసిన సురేఖ - వేటు పడితే ఆ వెంటనే..!!
ఢిల్లీ వేదికగా కొండా సురేఖ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. తన పైన హైకమాండ్ చర్యలకు సిద్దం అవుతున్న వేళ కొండా సురేఖ నేరుగా సీఎం రేవంత్ తో అమీ తుమీకి సిద్దం అయ్యారు. తన పైన చర్యలు తీసుకునే ముందే రేవంత్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ చీఫ్ ఖార్గేతో భేటీ అయిన కొండా ఆ తరువాత ఈ వ్యాఖ్యలు చేసారు. బీసీ కార్డు తెర మీదకు తీసుకొచ్చారు. తన పైన వేటు వేస్తే ఆ వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాలతోనూ సురేఖ సిద్దం అయినట్లు తెలుస్తోంది.
కొండా సురేఖ ఢిల్లీ కేంద్రంగా మరో సంచలనానికి కారణమయ్యారు. సీఎం రేవంత్ తో పాటుగా కేబినెట్ మంత్రులను టార్గెట్ చేసారు. తాను తప్పు చేయలేదని.. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను తాను బాధ్యత ఎలా వహిస్తానని ప్రశ్నిస్తున్నారు. తనకు అసలు నోటీసులు ఇవ్వటమే తప్పు అని తేల్చి చెప్పారు. రాహుల్ పదే పదే మహిళలు స్వతంత్రంగా బతకాలని చెబుతూ ఉంటారని.. ఇప్పుడు చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. బీసీ అయిన తన పైనే చర్యలు ఉంటాయా.. రేవంత్ పైన వ్యాఖ్యలు చేస్తన్న ఇతర వర్గాలకు చెందిన వారి పైన ఉండవా అంటూ ప్రశ్నించారు. తానే పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ ఎలా చెబుతారని సురేఖ నిలదీసారు. పరకాల సీటు రేవంత్ ఎలా ప్రకటిస్తారని.. ఇది క్రమశిక్షణా రాహిత్యం కింద కు రాదా అని అడుగుతున్నారు. ముఖ్యమంత్రిగా తానే ఉంటానని చెబుతున్న రేవంత్ పైన ర్యలు ఉండవా అంటూ ప్రశ్నిస్తున్నారు.

వేటు వేస్తే ఆ వెంటనే.. యాక్షన్ ప్లాన్ సిద్దం
తన బిడ్డ ను రెచ్చగొడితే స్పందించిందని .. ఇదే విషయాన్ని తాను రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ కు లేఖ ద్వారా వివరించానని చెప్పుకొచ్చారు. కాగా.. ఇదే సమయంలో కొండా సురేఖ తనతో పాటుగా తన భర్త సామాజిక వర్గాలను ప్రస్తావిస్తూ బీసీ కార్డు తెర మీదకు తీసుకొచ్చారు. పార్టీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ కు పూర్తి వివరణ ఇచ్చానని వెల్లడించారు. రేవంత్ చేసే పనులు.. వ్యాఖ్యలు పార్టీ క్రమ శిక్షణా కిందకు రావా అంటూ ప్రశ్నిస్తున్నారు. అధిష్ఠానానికి చెప్పాల్సింది చెప్పానని.. వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దామని వ్యాఖ్యానించారు. సురేఖ వ్యాఖ్యలతో హైకమాండ్ ఏ చర్యలు తీసుకున్నా.. తాను సిద్దంగానే ఉన్నట్లుగా సురేఖ సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యాఖ్యల తరువాత సురేఖ పైన వేటు ఖాయమనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే సురేఖ సైతం తన నిర్ణయంతో సిద్దమైనట్లు తెలుస్తోంది. సంచలన నిర్ణయం వైపే సురేఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో.. ఇప్పుడు సురేఖ ప్రశ్నల వేళ.. హైకమాండ్ వేచి చూసే ధోరణి తో ఉంటుందా.. చర్య తీసుకుంటారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications