వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ వర్షం: అత్యవసరంగా రోడ్డుపై దిగిన హెలికాప్టర్

|
Google Oneindia TeluguNews

ఈటానగర్: భారీ వర్షం కారణంగా ఓ పైలట్‌ హెలికాప్టర్‌ని అస్సాంలోని గోహ్‌పూర్‌ రోడ్డుపైనే దించేశాడు. ఆ పవన్‌ హన్స్‌ సంస్థకి చెందిన ఎమ్‌ఐ-172 హెలికాప్టర్‌‌లో 19మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు.

మంగళవారం 8.15 గంటల ప్రాంతంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్‌లాగున్‌ నుంచి గౌహతికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్‌ నటుడు పలాష్‌ సేన్‌ కూడా ఆసమయంలో హెలికాప్టర్‌లో ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Helicopter lands on road

హెలికాప్టర్ రోడ్డుపై దిగిన కారణంగా, కొంతసేపటికి వరకు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. కాగా, హెలికాప్టర్‌ను చూసేందుకు భారీగా స్థానికులు అక్కడకు చేరుకున్నారు. హెలికాప్టర్‌ దిగిన గంట తర్వాత వర్షం తగ్గిందని.. దీంతో మళ్లీ నహర్‌లగున్‌కి హెలికాప్టర్‌ బయలుదేరిందని స్థానికులు తెలిపారు.

హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయిన ప్రదేశానికి సమీపంలో భారీ వృక్షాలున్నాయని పైగా రోడ్డు చాలా చిన్నగా ఉన్నా, పైలట్‌ చాలా జాగ్రత్తగా ల్యాండ్‌ చేశారని స్థానికులు చెప్పారు.

English summary
A Pawan Hans helicopter on Tuesday made an emergency landing on a road due to inclement weather at Gohpur Balijan in Sonitpur district near the Assam-Arunachal Pradesh border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X