Hemanth soren: నాలుగోసారి జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్-తరలివచ్చిన ఇండియా కూటమి..!

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి హేమంత్ సోరెన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం నేపథ్యంలో సోరెన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలంతా తరలివచ్చారు. ఇందులో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేజ్రివాల్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఉదయనిధి స్టాలిన్, మమతా బెనర్డీ, డీకే శివకుమార్, భగవంత్ సింగ్ మాన్ సహా పలువురు ఉన్నారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఒక్కరే ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ గంగ్వార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో మూడుసార్లు సీఎంగా పనిచేసిన హేమంత్ సోరెన్ ఇప్పుడు నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు.
ఇవాళ సోరెన్ మాత్రమే ప్రమాణం చేశారు. అసెంబ్లీలో బల నిరూపణ తర్వాత సోరెన్ కేబినెట్ విస్తరించనున్నారు. త్వరలో మంత్రివర్గ కూర్పుపై సోరెన్ ఇండియా కూటమి మిత్రపక్షాలతో చర్చించనున్నారు.

Hemanth soren took oath as jarkhand cm fourth time india bloc leaders attended ceremony

తాజా ఎన్నికల్లో హేమంత్ సోరెన్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బర్హెయిట్ సీటును నిలబెట్టుకున్నారు. బీజేపీ అభ్యర్ధి గమ్ లియేల్ హెంబ్రూమ్ పై దాదాపు 40 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇండియా కూటమి జార్ఖండ్ అసెంబ్లీలోని 81 సీట్లలో 56 సీట్లు గెల్చుకుని ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే కూటమి పార్టీలు ఉండటంతో అసెంబ్లీలో బల నిరూపణకు ప్లాన్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+