సుమలత మీద పోటీ, పక్కా క్లారిటీ ఇచ్చిన జాగ్వార్ హీరో, తెలుగింటి ఆడపడుచు రిలాక్స్, మోదీ చేతిలో !

2019 ఎన్నికల్లో మాండ్య లోక్‌సభ నియోజకవర్గం యావత్ భారతదేశ దృష్టిని ఆకర్షించింది. స్వతంత్ర అభ్యర్థిగా సుమలత అంబరీష్ పోటీ చేయగా, జేడీఎస్ నుంచి నిఖిల్ కుమారస్వామి పోటీ చేశారు. హోరాహోరీగా సాగిన పోరులో సుమలత అంబరీష్ విజయం సాధించగా, నిఖిల్ కుమారస్వామి చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ లోక్ సభ ఎన్నికల్లో నిఖిల్ కుమారస్వామి మండ్యలో పోటీ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

సుమలత తనకు ఎంపీ టికెట్ కావాలని ఢిల్లీలో ప్రయత్నించారని స్పష్టం వెలుగు చూసింది. ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలో నిఖిల్ కుమారస్వామి స్వయంగా మళ్లీ మండ్యలో పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చారు. మండ్యలో పోటీ గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడానని, మండ్యలో నేను పోటీ చెయ్యడం లేదని ఇప్పటికే మీకు చెప్పానని నిఖిల్ కుమారస్వామి అన్నారు. నేను ఎలాంటి ఒత్తిడితో పోటీ చేయనని, ఆలోచన కూడా చెయ్యలేదని నిఖిల్ కుమారస్వామి అన్నారు.

Hero Nikhil Kumaraswamy has given clarity about contesting in Mandya Lok Sabha constituency.

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన ఓటమి గురించి ఇక మాట్లాడదలుచుకోలేదని, గతంలో ఏం జరిగిందో మరిచిపోయి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నానని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి అన్నారు.

నేను మండ్యలో యాక్టివ్‌గా ఉండాలని అనుకున్నానని, 2019 లోక్ సభ ఎన్నికల్లో తాను మండ్య నుంచి పోటీ చేశాను కాబట్టి మండ్యలో యాక్టివ్‌గా ఉండాలనే ఆలోచన చేస్తున్నానని, జేడీఎస్ నాయకులతో తాను టచ్ లోనే ఉన్నానని నిఖిల్ కుమారస్వామి వివరించారు.

మండ్య లోక్ సభ నియోజక వర్గంపరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను పర్యటిస్తానని నిఖిల్ కుమారస్వామి తెలిపారు. బీజేపీ-జేడీఎస్ సీట్ల పంపకంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, లోక్ సభ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో గత నెల రోజుల నుంచి తాము సిద్ధమవుతున్నట్లు నిఖిల్ కుమారస్వామి తెలిపారు. పాండవపురలో జేడీఎస్ నాయకులు, కార్యకర్తలతో నిఖిల్ కుమారస్వామి చర్చలు జరిపారు.

Hero Nikhil Kumaraswamy has given clarity about contesting in Mandya Lok Sabha constituency.

అనంతరం మీడియాతో మాట్లాడిన నిఖిల్ కుమారస్వామి కోలార్, చిక్కబళ్లాపూర్ సహా మండ్యలో తాను ఇంటింటికి తిరగాలని నిర్ణయించుకున్నానని అన్నారు. బీజేపీ, జేడీఎస్ సీట్ల పంపకాల గందరగోళంపై ఆయన వ్యాఖ్యానిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మైసూరులో సమావేశం నిర్వహించిన సమావేశంలో బీజేపీ నేతలకు సూచనలిచ్చారని, ఇదే సమయంలో మా పార్టీలో (జేడీఎస్)లో ఎలాంటి గందరగోళం లేదని, ఆరోగ్యకరమైన ఎన్నికలు కావాలని నిఖిల్ కుమారస్వామి అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు మళ్లీ ప్రధాని కావాలని ఇప్పటికే మా తాతగారు హెచ్ డీ దేవెగౌడ చెప్పారని, మేము ఎలాంటి గందరగోళం సృష్టించబోమని నిఖిల్ కుమారస్వామి స్పష్టం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కుమారస్వామి పోటీ చేసే విషయం తనకు తెలియదు. కుమారస్వామిపై కార్యకర్తలు, నేతల నుంచి ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉందని, దీనిపై మా నాన్న నిర్ణయం తీసుకుంటానని నిఖిల్ కుమారస్వామి తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+