వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

High alert: ఎర్రకోట, మెట్రో, రంగంలోకి షార్ప్ షూటర్లు, ఎన్ఎస్ జీ కమాండర్లు, 5 వేల మందితో !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్బంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భారతదేశం తల ఎత్తుకుని గర్వంగా నిలబడిన ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఎలాంటి ఆంటకాలు ఎదురుకాకుండా నిర్వహించడానికి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎర్రకోట వద్ద 5 వేల మంది ప్రత్యేక పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఢిల్లీ మెట్రో రైల్వేస్టేషన్లు పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. ఢిల్లీలోని ఎత్తైన కట్టడాలు, భవనాల మీద షార్ప్ షూటర్స్, ఎన్ఎస్ జీ కమాండర్లు కాపలా కాస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా డ్రోన్లు, బెలున్లు ఎగరవేయకూడదని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వీవీఐపీలు హాజరు అవుతున్న సందర్బంగా ఢిల్లీ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. మరో వైపు బంగ్లాదేశ్ సరిహద్దులో ఆపరేషన్ అలర్ట్ పేరుతో బీఎస్ఎఫ్ బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ లోకి ఎవ్వరూ చొరబడకుండా బీఎస్ఎఫ్ బలగాలు బందోబస్తులో నిమగ్నం అయ్యాయి.

Illegal affair: ఒకే కంపెనీలో ఉద్యోగం, భర్త ఫ్రెండ్ భార్యకు బోనస్, పండగే పండగ, అక్కడ రేణు !Illegal affair: ఒకే కంపెనీలో ఉద్యోగం, భర్త ఫ్రెండ్ భార్యకు బోనస్, పండగే పండగ, అక్కడ రేణు !

 ఢిల్లీలో ఇప్పుడు ఇదే సీన్

ఢిల్లీలో ఇప్పుడు ఇదే సీన్

స్వాతంత్ర దినోత్సవం 75వ సంవత్సరాల వేడుకలు జరుగుతున్న సందర్బంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భారతదేశంలోని ప్రతి పౌరుడు తల ఎత్తుకుని గర్వంగా నలబడే ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఎలాంటి ఆంటకాలు ఎదురుకాకుండా నిర్వహించడానికి ఢిల్లీలో పోలీసు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

 రంగంలోకి షార్ప్ షూటర్స్, ఎన్ఎస్ జీ కమాండర్లు, మెట్రో రైలు !

రంగంలోకి షార్ప్ షూటర్స్, ఎన్ఎస్ జీ కమాండర్లు, మెట్రో రైలు !

ఢిల్లీలోని అన్ని ఎత్తైన కట్టడాలు, భవనాల మీద ఇప్పటికే మకాం వేసిన షార్ప్ షూటర్స్, ఎన్ఎస్ జీ కమాండర్లు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఎత్తైన కట్టడాల మీద నుంచి దేశ రాజధానిలోని అన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సంచరిస్తున్న ప్రతి వాహనాన్ని అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రతివాహనంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న అధికారులు ఆ వాహనాలు నిషేధిత ప్రాంతాలకు వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అన్ని మెట్రో రైల్వే సేషన్ల దగ్గర అదనపు పోలీసు బలగాలు భద్రత కల్పిస్తున్నాయి.

 డ్రోన్లు, బెలూన్ల పై నిషేధం

డ్రోన్లు, బెలూన్ల పై నిషేధం

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం నుంచి డ్రోన్లు, బెలూన్లు ఎవ్వరూ ఎగరవేయకూడదని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చిన్నపిల్లల దగ్గరకు బెలూన్లు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. ఎలాంటి వీడియోలు, ఫోటోలు చిత్రీకరించడానికి డ్రోన్లు ఎగరవేయకూడదని, ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే వారి మీద కఘిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.

 ఆరోజు దెబ్బతో హడల్

ఆరోజు దెబ్బతో హడల్

స్వాంతత్ర దినోత్సవం వేడుకలు జరుగుతున్న సందర్బంగా గత వారం రోజుల నుంచి ఢిల్లీలోని అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఇదే సమయంలో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి 55 ఆటో మేటిక్ పిస్టోల్స్, 50 సజీవంగా ఉన్న బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతున్న రెండు రోజుల ముందు 55 అత్యాధునిక పిస్టోల్స్ తో నలుగురు నిందితులు పట్టుబడటంతో పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు.

 ఎర్రకోట కోసం 5 వేల మంది

ఎర్రకోట కోసం 5 వేల మంది

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే ఎర్రకోట దగ్గర 5 వేల మంది ప్రత్యేక పోలీసులు, ఎన్ఎస్ జీ కమాండర్లు, షార్ప్ షూటర్లను రంగంలోకి దింపారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకలు పూర్తి అయ్యే వరకు 5 వేల మంది ప్రత్యేక పోలీసులతో పాటు ఇంతకు ముందు నియమించిన పోలీసులు, ఎన్ఎస్ జీ కమాండర్లు భద్రతా ఏర్పాట్లు నిమగ్నం అవుతారని సంబంధిత అధికారులు అంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఢిల్లీ నగరం పూర్తిగా పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది.

English summary
High alert: Metro on high alert ahead of Independence Day celebrations in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X