వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కూతురికి అబార్షన్ చేయించండి: హైకోర్టును కోరిన రేప్ బాధితురాలి తండ్రి

|
Google Oneindia TeluguNews

చెన్నై: అత్యాచారానికి గురై గర్భం దాల్చిన తన మైనర్ కూతురి దీనస్థితి చూడలేక ఓ తండ్రి చేసిన విజ్ఞప్తి మద్రాస్‌ హైకోర్టును కదిలించింది. తొమ్మిదో తరగతి చదువుతున్న తన కూతురుకు గర్భస్రావం చేసేలా వైద్యులను ఆదేశించాలని కోరుతూ ఆ బాలిక తండ్రి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

తమిళనాడులోని ధారుపురం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆ బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చి 12 వారాలవుతోంది. తన కూతురుకు గర్భస్రావం చేయాలని బాలిక తండ్రి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను కోరగా న్యాయస్థానం అనుమతి తీసుకొస్తే, చేస్తామని చెప్పారు.

High Court directs hospital to consider father's plea to terminate minor daughter's pregnancy

ఈ నేపథ్యంలో ఆ బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. తన బిడ్డకు ప్రసవం జరిగితే, ఆమె భవిష్యత్తులో తలెత్తుకు తిరగలేదని పేర్కొన్నారు.

ఈ కేసులో ఆ బాలిక తండ్రి చేసిన అభ్యర్థన సమర్థనీయమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టిఎస్‌ శివజ్ఞానం అన్నారు. గర్భస్రావ చట్టం 1971 సెక్షన్‌ 3(2)(బి) ప్రకారం ఆ బాలికకు వైద్యులు గర్భస్రావం చేయొచ్చని న్యాయమూర్తి తెలిపారు.

English summary
The Madras High Court on Tuesday directed a government Hospital to consider a representation made by the father of a minor girl, who was allegedly raped, to terminate her pregnancy as per procedure under Section 3(2)(b) of the Medical Termination of Pregnancy Act, 1971.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X