Hijab Row: ఇస్లాం ప్రకారం హిజాబ్ తప్పనిసరేం కాదు- హైకోర్టులో కర్నాటక సర్కార్ వాదన

కర్నాటకలో మొదలైన ముస్లిం బాలికల హిజాబ్ ధారణ వివాదం ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్ధాయికి కూడా పాకుతున్న నేపథ్యంలో ఇవాళ కర్నాటక సర్కార్ తన అభిప్రాయం తేల్చిచెప్పేసింది. కర్నాటక హైకోర్టులో హిజాబ్ వివాదంలో జరుగతున్న విచారణలో భాగంగా కర్నాటకలోని బీజేపీ సర్కార్ తన వాదన వినిపించింది.

ఇస్లాం ప్రకారం ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని కర్నాటకలోని బసవరాజ్ బొమ్మై సర్కార్ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఇవాళ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. హిజాబ్ ఇస్లాం మతానికి అవసరమైన మతపరమైన ఆచారం కాదని, దాని ఉపయోగాన్ని నిరోధించడం మత స్వేచ్ఛకు హామీ ఇచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించదని కర్ణాటక ప్రభుత్వం ఇవాళ హైకోర్టులో వాదించింది.అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ మాట్లాడుతూ, ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి పద్ధతి కాదనేది ప్రభుత్వం అభిప్రాయమని చెప్పారు.

hijab is not compulsory in islam, karnataka government told high court

రాజ్యాంగంలోని 25వ అధికరణను ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ విద్యార్థులు హిజాబ్ లేదా కాషాయ కండువాలు ధరించకుండా నిషేధిస్తూ ఫిబ్రవరి 5న కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేసిన కొంతమంది ముస్లిం బాలికల అభియోగాన్ని కూడా ఏజీ తిరస్కరించారు.రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 5న జారీ చేసిన ఉత్తర్వులు చట్టానికి లోబడి ఉన్నాయని, అందులో అభ్యంతరం చెప్పాల్సిన పని లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే దీనిపై అన్ని వర్గాలు వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పు వెలువరించబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దీనిపై దుమారం రేగుతున్న నేపథ్యంలో కర్నాటక హైకోర్టులో ప్రభుత్వ వాదన ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+