అట్టుడుకుతున్న కర్ణాటక: హైస్కూల్స్, కాలేజీలు మూసివేతకు బొమ్మై ఆదేశం

బెంగళూరు: కర్ణాటకలో హిజబ్ వివాదం రోజురోజుకూ ఉగ్రరూపాన్ని దాల్చింది. తొలుత ఉడుపి, కోలార్ జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆందళనలు..ఉద్రిక్తతలు మరింత విస్తరించాయి. కర్ణాటక ఉత్తర ప్రాంతానికీ పాకాయి. తాజాగా బాగల్‌కోటె, శివమొగ్గ వంటి పలు జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. హిజబ్ వివాదంలో ఇప్పటిదాకా రాళ్లు రువ్వుకున్న సంఘటనలు చోటు చేసుకోలేదు. తాజాగా- ఈ వివాదం మరింత ముదిరినట్టే కనిపిస్తోంది.

హిజబ్ వర్సెస్ కాషాయం..

హిజబ్ వర్సెస్ కాషాయం..

మండ్య సహా కర్ణాటక ఉత్తర ప్రాంతంలోని బాగల్‌కోటె సహా శివమొగ్గ, యాద్గిర్ జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముస్లిం విద్యార్థినులు సంప్రదాయబద్ధమైన హిజబ్‌ ధరించి ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో అడుగు పెట్టడానికి అధికారులు అంగీకరించకపోవడం, అదే సమయంలో మరికొందరు విద్యార్థులు కాషాయ కండువాలను ధరించి తరగతులకు హాజరు కావడం.. వంటి పరిణామాల వల్ల కర్ణాటక అట్టుడికిపోతోంది.

నిరసన ప్రదర్శనల హోరు..

నిరసన ప్రదర్శనల హోరు..

బాగల్‌కోటె జిల్లాలోని రబకవి బనహట్టిలోని ప్రీ-యూనివర్శిటీ కళాశాల వద్ద ఈ ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజబ్‌ను ధరించిన పలువురు విద్యార్థినులు కళాశాల ఎదురుగా నిరసన ప్రదర్శనలకు దిగారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో మరికొందరు విద్యార్థులు మెడలో కాషాయ కండువా వేసుకుని తరగతులకు హాజరయ్యారు.

రాళ్లు రువ్వుకునేంత వరకూ..

రాళ్లు రువ్వుకునేంత వరకూ..

హిజబ్ ధరించిన విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కాషాయ కండువాను ధరించిన విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇది మరింత ముదిరింది. నిరసన ప్రదర్శనలు చేస్తోన్న వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీనితో బనహట్టిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టారు. పరిస్థితి చేయి దాటకముందే అదుపు చేశారు.

శివమొగ్గ జిల్లాలోనూ..

శివమొగ్గ జిల్లాలోనూ..

బనహట్టిలో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ వివాదాన్ని శాంతియుంతంగా పరిష్కరించడానికి జిల్లా పాలన యంత్రాంగం ప్రయత్నిస్తోందని అన్నారు. శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించొద్దని విజ్ఞప్తి చేశారు. అటు శివమొగ్గ జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని పలు కళాశాలల్లో హిజబ్, కాషాయ కండువాల వివాదం తీవ్రంగా కనిపించింది. సహ్యాద్రి కళాశాల, ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ విద్యాసంస్థల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

జాతీయ పతాకానికి బదులుగా..

జాతీయ పతాకానికి బదులుగా..

ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే.. జాతీయ జెండాను కిందికి దింపి- కాషాయ పతాకాన్ని ఎగురవేయడం పట్ల దుమారం చెలరేగింది. శివమొగ్గలోని ఓ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్తంభంపై రెపరెపలాడుతోన్న త్రివర్ణ పతాకాన్ని ఓ విద్యార్థి తొలగించాడు. దాని స్థానంలో కాషాయ పతాకాన్ని ఎగురవేశాడు. అతను చేసిన ఈ పని పట్ల తోటి విద్యార్థులందరూ హర్షాతిరేకాలు చేస్తూ అభినందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రశంసించిన ఒవైసీ..

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు ఆ విద్యార్థినిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమెను కన్న తల్లిదండ్రులు గొప్పవారని కీర్తించారు. ఆమె ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరు పుణికి పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ కళాశాలలు, విద్యార్థుల మధ్య మతం అనే చిచ్చు పెట్టిందని మండిపడ్డారు.

మండ్య విద్యార్థిని వీడియో వైరల్..

మండ్య విద్యార్థిని వీడియో వైరల్..

కొన్ని చోట్ల విద్యార్థులు పరస్పరం రాళ్లు సైతం రువ్వుకున్నారు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. లాఠీఛార్జీ చేసి, వారిని చెదరగొట్టారు. కాషాయ కండువాలను ధరించిన విద్యార్థులు శివమొగ్గలోని బీహెచ్ రోడ్‌లో భారీ ర్యాలీని నిర్వహించారు. జైశ్రీరామ్ అంటూ నినదించారు. మండ్యలోని ఓ కళాశాలలో హిజబ్ ధరించి కళాశాలకు హాజరైన ఓ విద్యార్థినిని ఉద్దేశించి కాషాయ కండువాలను ధరించిన విద్యార్థులు కొందరు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం, దానికి ప్రతిగా ఆమె అల్లా హు అక్బర్ అంటూ ఎలుగెత్తడం చర్చనీయాంశమైంది.

Recommended Video

    Karnataka : Salesman కి గట్టిగా బుద్ది చెప్పిన Farmer, ఏం చేసాడో తెలుసా ? | Oneindia Telugu
    మూడు రోజుల సెలవు..

    మూడు రోజుల సెలవు..

    ఈ పరిణామాల మధ్య కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలను మూడురోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఓ ట్వీట్ చేశారు. విద్యార్థులు సంయమనాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. హిజబ్ వివాదానికి సంబంధించిన పిటీషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోందని అన్నారు. విద్యార్థులు శాంతంగా ఉండాలని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+