Hijab Row:కర్నాటక హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు విద్యార్థులు..ఏం జరుగుతోంది..?

హిజబ్ వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. ఇప్పటికే హిజబ్ వ్యవహారం ఇటు కర్నాటకతో పాటు పలు ఇతర రాష్ట్రాలను కూడా కుదిపేస్తున్న నేపథ్యంలో గురువారం కర్నాటక హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వెలువడే వరకు ఎవరూ మతపరమైన వస్త్రాలను ధరించరాదని ఆదేశాల్లో పేర్కొంటూ వెంటనే కాలేజీలు, స్కూళ్లు తెరిచేలా ఆదేశాలు జారీచేస్తామంటూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ముస్లి విద్యార్థులు సుప్రీంకోర్టు తలపు తట్టారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హిజబ్ కేసుకు సంబంధించి వాదనలు కర్నాటక హైకోర్టులో నిన్న ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులపై అభ్యంతరం తెలిపిన ముస్లిం విద్యార్థుల తరపున లాయరు... ఆహారం నీరు రెండిటిలో ఏది కావాలంటే ఎలా... రెండూ అవసరమే అని అన్నారు. ఈ మధ్యంతర ఉత్తర్వులు హక్కులను రద్దు చేయడం అవుతుందంటూ అభిప్రాయపడ్డారు. అయితే ఇది కొద్ది రోజులు మాత్రమే అని ఇందుకు సహకరించాలంటూ చీఫ్ జస్టిస్ అన్నారు. కేసు వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని మతాల వారికి ఆదేశాల వర్తించేలా ఉంటాయని చీఫ్ జస్టిస్ చెప్పారు.

Hijab Row: Muslim students challenges Karnataka HC orders in Supreme court

ఇక సుప్రీంకోర్టులో విద్యార్థులతో పాటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ కూడా మరో పిటిషన్ సుప్రీంకోర్టులో ధాఖలు చేశారు. అంతకుముందు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కపిల్ సిబల్ హిజబ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ విచారణ చేశారు. కర్నాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు కేసును బదిలీ చేయాలని కోరారు కపిల్ సిబల్. కర్నాటక హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+