ఆర్దిక కష్టాలు- సీఎం తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల జీతాల్లో 30 శాతం కోత..!!
ఆర్దిక సంక్షోభం పలు రాష్ట్రాలను వెంటాడుతోంది. ఫలితంగా బడ్జెట్ లో కోతలు తప్పటం లేదు. ఉచిత హామీల అమలు కష్టంగా మారుతోంది. ఖర్చు నియంత్రణలో భాగంగా ముందుగా సీఎం తో సహా మంత్రులు. ఎమ్మెల్యేలతో పాటుగా అధికారుల వేతనాల్లో కోతలు విధిస్తున్నారు. ఇది తొలిగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. రానున్న రోజుల్లో పలు రాష్ట్రాల్లో అమలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఈ నిర్ణయం సంచలనంగా మారుతోంది.
ఆర్దిక కష్టాలను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాల్లో తాత్కాలిక కోత అమలు కానుంది. ఆరు నెలల పాటు సీఎం వేతనంలో 50శాతం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వేతనాల్లో 30 శాతం, ఎమ్మెల్యేల వేతనాల్లో 20 శాతం మేర కోత పడనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే కోత విధించిన సొమ్మును తిరిగి ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం నుంచి గ్రాంట్లు నిలిచిపోవడం హిమాచల్ ఆర్థిక కష్టాలకు ప్రధాన కారణంగా అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవ్వడం, అప్పుల భారం పెరగడంతో ఆర్థిక క్రమశిక్షణను కాపాడేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతాధికారుల జీతాల్లో 30 శాతం కోత విధించాలని నిర్ణయించారు. రాబోయే ఆరు నెలల పాటు ఈ కోత అమలులో ఉంటుంది. ప్రజా ప్రతినిధులు మరియు ఉన్నత స్థాయి అధికారుల నుండి ఈ త్యాగాన్ని ప్రారంభించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఆరు నెలల వరకు కోత కొనసాగింపు
ఈ జీతాల కోత నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వం సామాన్యులపై భారం పడకుండా జాగ్రత్త వహించింది. క్లాస్-3 మరియు క్లాస్-4 స్థాయి ఉద్యోగులకు, అంటే తక్కువ వేతనం పొందే సిబ్బందికి ఈ కోత నుంచి మినహాయింపు ఇచ్చారు. కేవలం ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మరియు రాజకీయ నాయకులు మాత్రమే ఈ ఆర్థిక భారాన్ని పంచుకోవాలని నిర్ణయించడం గమనార్హం. ఇలాంటి కఠిన నిర్ణయం ద్వారా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల తీవ్రతను ప్రజలకు మరియు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ముఖ్యమంత్రి సుఖు వెల్లడించారు. అయితే.. పలు రాష్ట్రాల్లోనూ ఆర్దిక పరిస్థితి నియంత్రణ తిప్పుతోంది. ఉచిత పథకాల అమలు కోసం చేస్తున్న ఖర్చు పరిమితి మించటంతో.. ఆర్దిక నిర్వహణ ప్రభుత్వాలకు భారంగా మారుతోంది. దీంతో.. కోతల దిశగా ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. త్వరలోనే మరిన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కనిపించే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications