Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుండపోత వర్షం: వణికిపోయిన ధర్మశాల, కొట్టుకుపోయిన వాహనాలు, సీఎంకు అమిత్ షా ఫోన్, మోడీ రివ్యూ

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం కుండపోతగా వర్షం కురిసింది. ముఖ్యంగా ధర్మశాలలో కురిసిన అతి భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అనేక ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. ఒక్కసారిగా భారీ వర్షం, వరదలు రావడంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు.

రోడ్లపై నిలిచిన వాహనాలు వరదలో కొట్టుకుపోవడం గమనార్హం. రోడ్లు నదుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. బాగ్సు నాగ్ నాలా ఉప్పొంగి నగరంలో వరదనీరుతో ముంచెత్తింది. దీంతో పలు ఇళ్లు కూలిపోయాయి. అనేక హోటళ్లు ధ్వంసమయ్యాయి. పారిశుద్ధ్య కార్మికుల గుడారాలు కొట్టుకుపోయాయి.
వరద నీటిలో అనేక కార్లు కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియాల్ వైరల్ అయ్యాయి.

Himachal pradesh Cloudburst: PM Monitoring the situation, Amit Shah Dials CM Jai Ram Thakur

ధర్మశాలకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్రా జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. కాగా, రానున్న రోజుల్లోనూగా రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

కాగా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షం, వరదలపై ప్రధాని నరేంద్ర మోడీ పర్యవేక్షించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రానికి అన్ని రకాల సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+