Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హిమాచల్ ప్రదేశ్ లో దారుణం-కొండచరియల కింద బస్సు-32 మంది ప్రయాణికులతో

రెండు రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలోని నిగుల్సేరిలో కొండచరియలు విరిగిపడిన ఘటన హృదయవిదారకంగా మారింది. హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్ధకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, కనీసం రెండు ఇతర వాహనాలు ఈ ఘటనలో అదృశ్యమయ్యాయి. వీటిని ఇవాళ వెలికి తీశారు.

రెకాంగ్ పియో, రాంపూర్ మధ్య జాతీయ రహదారి పక్కన కొండచరియలు ఒక్కసారిగా విరిగి పడిపోవడంతో రోడ్డు కూడా భారీగా కుంగిపోయింది. ఈ ఘటనలో జాతీయ రహదారిపై ఉన్న ప్రయాణికుల బస్సుతో పాటు పలు వాహనాలు ఇందులో పడిపోయాయి. వెలికి తీత చర్యలు చేపట్టగా.. ఇందులో 32 మంది ప్రయాణికులతో కూడిన బస్సు లభ్యమైంది. ఇందులో ఉన్న వారంతా మృత్యువాత పడ్డారు.

himachal pradesh landslide : bus with 32 passengers buried under debris in kinnaur

కిన్నౌర్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత భారీగా బండరాళ్లు కూడా పడ్డాయి. దీంతో అప్పటికే కొండపై నుంచి బడిన బస్సుతో పాటు ఇతర వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇందులో ప్రయాణిస్తున్న వారంతా మృత్యువాత పడినట్లు భావిస్తున్నారు. ఎవరైనా బతికి ఉండే అవకాశాల్నీ తోసిపుచ్చలేమని అధికారులు చెప్తున్నా.. అది అసాధ్యంగానే కనిపిస్తోంది. అయితే విచిత్రంగా ఈ బస్సు నడిపిన డ్రైవర్ మాత్రం బతికి బయటపడ్డాడు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి కొండ చరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యల కోసం ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని రప్పించారు. సహాయక చర్యలు పూర్తయితే కానీ ఏమీ చెప్పలేమని అధికారులు వెల్లడించారు.

himachal pradesh landslide : bus with 32 passengers buried under debris in kinnaur

ఈ ఘటన తర్వాత రెకాంగ్ పియో, రాంపూర్ మధ్య జాతీయ రహదారిపై రాకపోకల్ని నిలిపేశారు. సహాయక చర్యల కోసం వెళ్లే వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్ధితుల మధ్య సహాయక చర్యల్ని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొనసాగిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+