ఇటీవలి కాలంలో నేనొక చిత్రమైన విషయం చూశా!!
గుజరాత్‌లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతాపార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రచారాన్ని ఉధృతం చేసింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి గుజరాత్ ఎప్పుడూ దారిచూపుతోందని, కాబట్టే గుజరాత్ లో భారతీయ జనతాపార్టీ విజయం సాధించాలని మనందరం నిర్థారించుకోవాలన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని, నరేంద్రమోడీ మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నికవ్వాలంటే గుజరాత్ లో గెలవడం ప్రధానమన్నారు.
కాంగ్రెస్, ఆప్ తమకు పోటీదారులు కాదని శర్మ స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో తాను చాలా చిత్రమైన విషయాన్ని చూశానన్నారు. రాహుల్ గాంధీ పార్టీ ప్రచారం కోసం పనిచేయలేదన్నారు. గౌహతిలో క్రికెట్ మ్యాచ్ ఉంటే రాహుల్ గుజరాత్ లో ఉంటారని, అందరూ క్రికెట్ ఆడేందుకు సిద్ధపడిన తరుణంలో ఆయన మాత్రం మైదానికి వచ్చి ఆడరన్నారు. శ్రద్ధాను అఫ్తాబ్ ముంబయి నుంచి తీసుకువచ్చి ఢిల్లీలో హత్యచేశాడని, దేశానికి బలమైన నాయకుడు లేకపోతే ఇలాంటి అఫ్తాబ్ లు పుట్టుకొస్తారని, ఈ తరహా ఘటనలను కట్టడి చేయాలంటే నరేంద్రమోడీ లాంటి నేత 2024లో మరోసారి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు.

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్, ఆప్ నుంచి తీవ్ర సవాల్ ఎదురవుతోంది. పంజాబ్ లో సంచలన విజయం సాధించినట్లుగానే గుజరాత్ లో కూడా సంచలన విజయాన్ని నమోదు చేస్తామని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేస్తున్నారు. తమకు అవకాశం ఇస్తే ఢిల్లీ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications