అంబానీ బ్రదర్ అదిరిపోయే హోలీ ఆఫర్: రూ.49కే 1జీబీ డేటా, ఇంకా..
ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో నుంచి పోటీ తట్టుకునేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ఇతర టెలీ కమ్యూనికేషన్ సంస్థలు. ఈ క్రమంలో తమ వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు బదిలీ కాకుండా.
న్యూఢిల్లీ: ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో నుంచి పోటీ తట్టుకునేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ఇతర టెలీ కమ్యూనికేషన్ సంస్థలు. ఈ క్రమంలో తమ వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు బదిలీ కాకుండా, కొత్త వారిని ఆకర్షించేందుకు ముకేష్ అంబానీ సోదరుడు అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కాం)
కూడా కొత్త ఆఫర్లతో రంగంలోకి దిగింది.
ఇందులో భాగంగా రూ.49కే 1జీబీ డేటా, రూ.149కే 3జీబీ డేటాతో పాటు నెట్‌వర్క్ పరిధిలో ఉచితంగా అపరిమిత లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకునే అవకాశం కల్పించింది. హోలీ పండగ సందర్భంగా 28రోజుల పాటు చెల్లుబాటు అయ్యేలా కొత్త ప్లాన్‌లను తీసుకొచ్చింది.

ఆర్‌కామ్ తన 3జీ, 2జీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని వివిధ ప్లాన్‌లను కూడా ప్రకటించింది. రూ.99కే అపరిమిత 3జీ డేటా, రూ.49కే అపరిమిత 2జీ డేటాను వాడుకునేందుకు ప్రత్యేక ఆఫర్లను వెల్లడించింది.
స్మార్ట్ ఫోన్ల వినియోగదారులతోపాటు ఫీచర్ ఫోన్ల వినియోగదారులను కూడా దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ఆఫర్లను ప్రవేశపెట్టిందని ఆర్‌కాం కన్జూమర్ బిజినెస్ కో-సీఈఓ గుర్దీప్ సింగ్ తెలిపారు. కాగా, జియో పోటీని తట్టుకునేందుకు ఇతర భారత సర్వీస్ ప్రొవైడర్లు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications