"హోలీ" విషెస్ పేరుతో లింక్స్.. ఓపెన్ చేస్తే అకౌంట్‌లో డబ్బులు స్వాహానే !

రంగుల పండుగ "హోలీ". చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ పండుగను తమ తమ పద్దతుల్లో జరుపుతూ ప్రజలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే పండుగ సందర్భంగా సైబర్ మోసాల ముప్పు కూడా పెరుగుతోంది. పండుగ ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు.

ఈ మేరకు నకిలీ ఆఫర్లు, ఫ్రీ గిఫ్టులు, భారీ డిస్కౌంట్లు, హోలీ పార్టీ పాస్‌లు అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ తరహా మోసపూరిత సందేశాలు విస్తరిస్తున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

holi-wishes-links-may-chance-for-looting-money-from-accounts-and-alert-about-cyber-crimes-to-people

ఎలా మోసం చేస్తున్నారు ?

నేరగాళ్లు ముందుగా ఆకర్షణీయమైన మెసేజ్‌లు పంపిస్తారు. "మీరు హోలీ గిఫ్ట్ వోచర్ గెలిచారు", "70% డిస్కౌంట్‌తో బ్రాండెడ్ వస్తువులు", "ఫ్రీ హోలీ పార్టీ పాస్" వంటి సందేశాలు అందరినీ ఆకట్టుకునేలా రూపొందిస్తారు. ఆ తర్వాత ఒక లింక్ క్లిక్ చేయమని కోరుతారు. ఆ లింక్ నకిలీ వెబ్‌సైట్‌కు దారి తీస్తుంది. అక్కడ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం, కార్డ్ నంబర్‌లు లేదా OTP అడుగుతారు. ఈ వివరాలు ఇచ్చిన వెంటనే ఖాతాలోని డబ్బు మాయమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఫేక్ కస్టమర్ కేర్ నంబర్‌ల ద్వారా కాల్ చేసి కూడా మోసం చేస్తున్నారు.

సాధారణంగా కనిపించే హోలీ స్కామ్‌లు..

నకిలీ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు

హోలీ పార్టీ టికెట్ మోసాలు

గిఫ్ట్ హ్యాంపర్ లాటరీల పేరుతో మోసాలు

QR కోడ్ స్కాన్ చేయమని చెప్పి డబ్బు దోచుకోవడం

ఫేక్ యూపీఐ రిఫండ్ మెసేజ్‌లు

సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్

ఈ స్కామ్‌లు ఎక్కువగా పండుగ సమయంలో వేగంగా విస్తరిస్తాయి.

గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు..

అనుమానాస్పద లింకులను అస్సలు క్లిక్ చేయవద్దు.

మీ OTP, బ్యాంక్ ఖాతా వివరాలు, కార్డ్ నంబర్‌లను ఎవరికీ చెప్పకండి.

చెల్లింపులు అధికారిక, విశ్వసనీయమైన వెబ్‌సైట్ల ద్వారానే చేయండి.

వెబ్‌సైట్ URLను జాగ్రత్తగా పరిశీలించండి (https ఉందా లేదా చూడండి).

సోషల్ మీడియాలో వచ్చిన ఆఫర్లను నేరుగా బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేయండి.

అపరిచితుల నుంచి వచ్చిన QR కోడ్‌లు స్కాన్ చేయవద్దు.

మీ మొబైల్, బ్యాంకింగ్ యాప్‌లలో రెండు-దశల భద్రత (Two-Factor Authentication) యాక్టివేట్ చేయండి.

సైబర్ మోసానికి గురైతే ఏం చేయాలి?

ఒకవేళ పొరపాటున వివరాలు షేర్ చేసి డబ్బు మోసపోయినట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. వెంటనే మీ బ్యాంక్‌కు సమాచారం ఇవ్వాలి. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలి.

కేంద్ర ప్రభుత్వ అధికారిక National Cyber Crime Reporting Portal (cybercrime.gov.in)లో కూడా ఆన్‌లైన్‌లో కంప్లైంట్ ఇవ్వవచ్చు. త్వరగా స్పందిస్తే డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

హోలీ పండుగ ఆనందంగా గడపాలంటే డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్త తప్పనిసరి.

భారీ తగ్గింపులు, ఉచిత బహుమతులు అంటూ వచ్చే ప్రతి సందేశాన్ని నమ్మకండి. కేవలం ఒక క్లిక్ మీ ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించవచ్చు.

సైబర్ నేరగాళ్లు తెలివిగా మోసాలు చేస్తున్న ఈ కాలంలో, ప్రజలు కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+