లోక్‌సభలో షా ఉగ్రరూపం: కాశ్మీర్ కోసం ప్రాణాలైనా అర్పిస్తాం: పీఓకే.. సియాచిన్ మావే..!
Recommended Video
లోక్‌సభలో జమ్ము కాశ్మీర్ పునర్విభజన..ఆర్టికల్ 370 రద్దు బిల్లును హోం మంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారు. ఆ సమ యంలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల పైన మండిపడిన అమిత్ షా గర్జించారు. జమ్ము కాశ్మీర్ కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్దమని ప్రకటించారు. అదే సమయంలో జమ్మూకశ్మీర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), అక్సయ్ చిన్ కూడా అంతర్భాగాలేనని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్గాభాగమని తేల్చి చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేయవద్దని కాంగ్రెస్ చెప్పగలదా అని నిలదీసారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందటం..లోక్‌సభలో పూర్తి మెజార్టీ ఉండటంతో అమిత్‌షా ఇక తన సత్తా చాటేందుకు పూర్తిగా సంసిద్దులయ్యారు.
కాశ్మీర్ కోసం ప్రాణాలైనా అర్పిస్తాం...
జమ్మూకశ్మీర్‌పై కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై విపక్షాలు అడిగే ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. పీఓకే భారతదేశంలో భాగం కాదని మీరు అనుకుంటున్నారా అని కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిని ఉద్దేశించి అమిత్‌షా నిలదీశారు. ఈ ప్రాంతం కోసం మా జీవితాలు కూడా పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నేను పీఓకే గురించి చెప్పానంటే అది పీఓకేకు కూడా వర్తిస్తుంది అని వ్యాఖ్యానించారు. పీఓకేతో పాటుగా అక్సయ్ చిన్ సహా జమ్మూకశ్మీర్ సరిహద్దులను మన రాజ్యాంగంలో పొందుపరిచారని..అవి భారత్‌లో అంతర్బాగమే అని పార్లమెంట్ వేదికగా షా తేల్చి చెప్పారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగామని రాజ్యాంగం విస్పష్టంగా పేర్కొందని, అందుకోసం తాము ఎలాంటి చర్యలకైనా వెనుకాడేది లేదని అమిత్‌షా ఒకింత గొంతు పెంచి తమ వైఖరి ఏంటో స్పష్టం చేసారు.

పీఓకే..అక్సయ్ చిన్ మన అంతర్బాగమే..
లోక్‌సభలో హోం మంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. జమ్ము కాశ్మీర్‌లో అసెంబ్లీ ఉంటుందని స్పష్టం చేసారు. అసెంబ్లీ తో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి అమిత్ షా ప్రస్తావించారు. పీఓకే మాత్రమే కాదు.. అక్సయ్‌చిన్ సైతం భారత్‌లో అంతర్బాగమే అని చెప్పటం ద్వారా అటు పాకిస్థాన్..ఇటు చైనాకు తమ విధానం పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసారు. దీని ద్వారా తమ భవిష్యత్ లక్ష్యం ఏంటనేది పరోక్షంగా అమిత్ షా స్పష్టం చేసినట్లుగా అర్దం అవుతోంది. ఇప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో ప్రతిప క్షంలో ఉన్న కాంగ్రెస్ పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. ఇక..కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నేత సైతం తాము బిల్లును వ్యతిరేకించలము..మద్దతు చెప్పలేమని చెబుతూ సభ నుండి వాకౌట్ చేసారు. సభలో హోం మంత్రి అమిత్ షా పరిస్థితులను పూర్తిగా తనుకు అనుకూలగా మలచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications