ప్రతీ నెలా రూ.100కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి ఆర్డర్... ముంబై మాజీ పోలీస్ బాస్ సంచలన ఆరోపణలు...
ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.ఇటీవల సస్పెండ్ అయిన పోలీస్ అధికారి సచిన్ వాజే విధుల్లో ఉన్న సమయంలో...ప్రతీ నెలా తనకు రూ.100కోట్లు వసూలు చేసి ఇవ్వాలని హోంమంత్రి ఆయనకు టార్గెట్ ఫిక్స్ చేశారని ఆరోపించారు. ఇదే విషయమై పలుమార్లు సచిన్ వాజేని తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారని ఆరోపించారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకి పరమ్ వీర్ సింగ్ శనివారం(మార్చి 20) ఒక లేఖ రాశారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కలకలం రేపిన ఘటనలో సచిన్ వాజేని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు ముంబై కమిషనర్‌గా ఉన్న పరమ్ వీర్ సింగ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

లేఖలో పరమ్ వీర్ సింగ్
'ముంబై క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్ హెడ్‌గా ఉన్న సమయంలో సచిన్ వాజేని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తరుచూ తన అధికారిక నివాసానికి పిలిపించేవారు. ప్రతీ నెలా తనకు ఫండ్స్ వసూలు చేసివ్వాలని పలుమార్లు అనిల్ దేశ్‌ముఖ్ సచిన్ వాజేని కోరారు. ఫిబ్రవరి మధ్య వారంలో హోంమంత్రి ఒకసారి సచిన్ వాజేని తన నివాసానికి పిలిచారు. ఆ సమయంలో హోంమంత్రి సిబ్బంది ఒకరిద్దరితో పాటు ఆయన పర్సనల్ సెక్రటరీ అక్కడ ఉన్నారు. ప్రతీ నెలా రూ.100కోట్ల వసూళ్లు చేయాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా సచిన్ వాజేతో హోంమంత్రి చెప్పారు.' అని పరమ్ వీర్ సింగ్ లేఖలో పేర్కొన్నారు.

'ముంబైలో దాదాపు 1750 బార్లు
'ముంబైలో దాదాపు 1750 బార్లు,రెస్టారెంట్లు ఉన్నాయి. ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.2-3లక్షలు వసూలు చేసినా నెలకు రూ.40-50కోట్లు వసూలు చేయవచ్చునని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సచిన్ వాజేతో చెప్పారు. మిగతా రూ.50కోట్లు ఇతరత్రా మార్గాల్లో వసూలు చేయాలని చెప్పారు.' అని పరమ్ వీర్ సింగ్ ఆ లేఖలో ఆరోపించారు. మరోవైపు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఈ లేఖను కొట్టిపారేశారు. అంబానీ ఇంటి వద్ద బాంబు బెదిరింపు కేసు నుంచి తనను తాను కాపాడుకునేందుకు అతనిలా చేస్తున్నాడని ఆరోపించారు. ఈ కేసులో సచిన్ వాజేతో పాటు పరమ్ వీర్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నందువల్లే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ట్వీట్ చేశారు.

'పరమ్ వీర్ సింగ్
'పరమ్ వీర్ సింగ్,ఆయన సహోద్యోగులు తీవ్ర తప్పిదాలకు పాల్పడినందువల్లే వేటు పడింది.' అని ఇటీవల హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. సచిన్ వాజే కేసులో విచారణ సజావుగా, పారదర్శకంగా సాగేందుకు వీలుగానే పరమ్‌వీర్ సింగ్‌ను బదిలీ చేశామన్నారు. పరమ్ వీర్‌తో పాటు తీవ్ర తప్పిదాలకు పాల్పడ్డవారిపై దర్యాప్తు నివేదిక అందాక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పరమ్ వీర్ సింగ్ హోంగార్డ్స్ విభాగంలో పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో పరమ్ వీర్ సింగ్ ఏకంగా హోంమంత్రిని టార్గెట్ చేస్తూ లేఖ రాయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications