పరువు కోసం: పెళ్లికి గంటల ముందు ప్రేమజంట హత్య

వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లాలోని గాంధీనగర్‌కు చెందిన మమినాయక్ (20), అదే గ్రామానికి చెందిన అమర్ నాయక్(20) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. బెర్హంపూర్ శివారులోని హల్దియాపదర్‌లోని ఓ గ్యారేజిలో పని చేస్తున్న అమర్, అక్కడే తన తల్లి సంజుక్తాతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ ప్రేమకు నిరాకరించిన మమి కుటుంబ సభ్యులు, ఆమెకు వేరే అబ్బాయితో వివాహం నిశ్చయించారు.
ఆదివారం నహనపూర్‌లో వివాహం జరిగాల్సి ఉండగా... ఈ పెళ్లి ఇష్టంలేని మమినాయక్, శనివారం రాత్రి భోజనాల తర్వాత అమర్ నాయక్ ఇంటికి వెళ్లిపోయింది. దీంతో అమర్ ఇంటికి వచ్చిన యువతి ఇద్దరు సోదరులు, చిన్నాన్న కొడుకు ఆమెను తిరిగి ఇంటికి వచ్చి తమ పరువును కాపాడాలని కోరారు. అయితే వారితో వెళ్లడానికి యువతి నిరాకరించింది.
దీంతో ఆగ్రహానికి గురైన ఆమె సోదరులు యువతి ప్రియుడు అమర్ తల్లి సంజుక్తాపై దాడి చేశారు. ఆ తర్వాత అత్యంత దారుణంగా మారణాయుధాలతో మమి, అమర్‌లను హత్య చేసి అక్కడ్నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. యువతి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications