ఉన్నవ్ ఘటనపై మోడీ దీక్ష చేయాలి: రాహుల్, నిజంగానా.. క్యూట్: కేజ్రీవాల్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరోజు దీక్షపై కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏఏపీ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాల తీరుపై మనస్తాపం చెందిన మోడీ విపక్షాల తీరుకు నిరసనగా గురువారం నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు.

అయితే దీనిపై రాహుల్ మరోసారి స్పందించారు. యూపీలోని ఉన్నావ్‌లో 16ఏళ్ల బాలికపై అత్యాచారం ఉదంతంపైనా స్పందిస్తే బాగుంటుందన్నారు. అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌పై ఇన్ని రోజులు ఎందుకు చర్యలు తీసుకోలేదని, బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో మృతి చెందడానికి కారణంగా ఆరుగురు పోలీసులను విధుల నుంచి తొలగించారని, అయితే ఆయన మరణం వెనక ఎవరున్నారనే విషయాన్ని ఎందుకు విస్మరించారని, బాధితురాలికి జరిగిన అన్యాయానికి నిరసనగా ప్రధాని, బీజేపీ నేతలు నిరాహార దీక్ష చేయచ్చు కదా, మన దేశంలో ఆడపిల్లలపై వివక్ష ఇంకా కొనసాగుతోందని, వారికి రక్షణ ఇవ్వడంలో బీజేపీ పాలకులు విఫలమయ్యారని ట్విట్‌ చేశారు.

Hope PM Narendra Modi will observe fast on Unnao incident, says Rahul

మోడీ దీక్షపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. అది నిజంగా క్యూట్ అన్నారు. కాగా, గతేడాది జూన్‌ 4న స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ తనను అత్యాచారం చేశాడంటూ 16 ఏళ్ల బాలిక గతవారం సీఎం యోగి ఇంటిముందు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఎమ్మెల్యే, బాధితురాలి తరఫు బంధువులకు జరిగిన వివాదంలో జైలు పాలయిన బాధితురాలి తండ్రి సోమవారం పోలీసు కస్టడీలో మృతి చెందారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Taking a swipe at the prime minister's proposed hunger strike over the non-functioning of Parliament, Congress president Rahul Gandhi wondered today if Narendra Modi would observe a fast on the Unnao incident which, he said, " has shamed humanity".

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి