దేశ రాజధానిలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ ఎటాక్
దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. దిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థినిపై కొందరు దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. నార్త్ వెస్ట్ దిల్లీలోని లక్ష్మీబాయి కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థిని అక్టోబర్ 26 న ఆదివారం ఎక్స్ ట్రా క్లాస్ కు వెళ్తున్న క్రమంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గాలిస్తున్నారు. ఈ దాడిలో గాయపడిన స్టూడెంట్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
దేశ రాజధాని దిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. దిల్లీ యూనివర్సిటీకు చెందిన ఓ విద్యార్థినిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. యువతి ముఖానికి చేతులు అడ్డు పెట్టడంతో చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం యువతి దిల్లీలోని ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన నార్త్ వెస్ట్ దిల్లీలోని లక్ష్మీబాయి కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఆమె త్వరలోనే డిశ్చార్జ్ కానున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన అక్టోబర్ 26 ఉదయం 10 గంటలకు జరిగినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసుల విచారణలో విద్యార్థినిపై యాసిడ్ దాడికి పాల్పడింది జితేందర్ అనే వ్యక్తి అని తేలింది. నిందితుడు విద్యార్థిని నివాసం ఉండే ప్రాంతమైన ముకుందాపుర్ లోనే ఉంటున్నట్లు స్పష్టం అయింది. జితేందర్ తన స్నేహితులు ఇషాన్, అర్మాన్ లతో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. వీళ్లు ముగ్గురూ బైక్ పై వచ్చారు. ఘటన సమయంలో ఇషాన్ తన వద్ద ఉన్న యాసిడ్ బాటిల్ ను అర్మాన్ కు ఇచ్చాడు. అతడు విద్యార్థినిపై యాసిడ్ తో దాడికి పాల్పడ్డాడు.
యాసిడ్ దాడి చేస్తున్న సమయంలో యువతి తన ముఖానికి చేతులను అడ్డు పెట్టుకుంది. దీంతో ఆమె చేతులకు గాయాలయ్యాయి. యువతి ప్రస్తుతం దిల్లీలోని ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె త్వరలోనే డిశ్చార్జ్ కానున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే నిందితుడు జితేందర్ కు బాధితురాలికి గతంలోనే ఓసారి ఏదో విషయంలో గొడవ జరిగినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే అతడు విద్యార్థినిపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితులను గాలిస్తున్నారు. బాధితురాలికి 20 ఏళ్లు ఉంటాయని దిల్లీ యూనివర్సిటీలో రెండో సంవత్సరం చదువుతుందని పేర్కొన్నారు. నిందితులకోసం తీవ్రంగా గాలిస్తున్నామని త్వరలోనే వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications