వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్య నిర్లక్ష్యానికి ఎన్నారైకి ఆసుపత్రి 11కోట్ల నష్టపరిహారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hospital to pay up Rs 11.4 crore for negligence
న్యూఢిల్లీ: వైద్య సేవలలో నిర్లక్ష్యం వహించి ఓ ప్రాణం పోయేందుకు కారణమైనందుకు బాధిత కుటుంబానికి రూ.5.96 కోట్లు చెల్లించాలని ఓ ఆసుపత్రికి, వైద్యులకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది. వైద్య చికిత్సలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన కోల్‌కతాలోని ఎఎంఆర్‌ఐ ఆసుపత్రితో పాటు ఆ ఆసుపత్రిలోని ముగ్గురు వైద్యులపై సుప్రీం కొరడా ఝుళిపించింది.

వీరి నిర్లక్ష్యం వల్ల 1998లో భార్యను కోల్పోయిన అమెరికాలోని కునాల్ షా అనే ప్రవాస భారత వైద్యుడికి భారీ మొత్తంలో 5.96 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని సుప్రీం కోర్టు గురువారం సంచలనాత్మక తీర్పును వెలువరించింది.

ఓహియోలో ఎయిడ్స్‌పై పరిశోధనలు చేస్తున్న కునాల్ షాకు ఎనిమిది వారాల్లో ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలని, ఈ చెల్లింపు పూర్తయిన తర్వాత అందుకు సంబంధించిన నివేదికను తమకు సమర్పించాలని జస్టిస్ ఎస్‌జె ముఖోపాధ్యాయ, జస్టిస్ వి గోపాల గౌడలతో కూడిన ధర్మాసనం ఎఎంఆర్‌ఐ ఆసపత్రితో పాటు సదరు వైద్యులకు స్పష్టం చేసింది.

అంతకుముందు ఈ కేసును విచారించిన ఎన్‌సిడిఆర్‌సి (నేషనల్ కన్జూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్) కునాల్ షాకు 1.73 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని 2011లో తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును కునాల్ షా సుప్రీం కోర్టులో సవాలు చేశారు.

దీంతో సుప్రీం కోర్టు నష్టపరిహార మొత్తాన్ని పెంచడంతో పాటు ఆ మొత్తంపై 6 శాతం చొప్పున వడ్డీ కూడా కునాల్ షాకు చెల్లించాలని ఎఎంఆర్‌ఐ ఆసుపత్రి యాజమాన్యాన్ని, సదరు వైద్యులను ఆదేశించింది. నష్ట పరిహారం రూ.5.96 కోట్లకు ఆరు శాతం వడ్డీ చొప్పున మొత్తం రూ.11.41 కోట్లు చెల్లించాలని సుప్రీం ఆదేశించింది.

English summary
Setting a precedent for cases of medical negligence, the Supreme Court on Thursday directed the AMRI Hospital in Kolkata to award a compensation of over Rs 11 crore to an Indian-American doctor for the death of his wife 15 years ago due to faulty treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X