మనపై తగ్గిన భారం, ప్రభుత్వానికి రెవెన్యూ: జీఎస్టీ వల్ల సామాన్యునికి ఎలా లాభం కలిగింది?
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో నోట్ల రద్దు, జీఎస్టీ ఉన్నాయి. నాలుగున్నరేళ్లలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోంది. జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) కారణంగా దేశంలోని మధ్యతరగతి ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరింది.
జీఎస్టీని అమలు చేయడం వల్ల నిత్యావసర వస్తువులపై పరోక్ష పన్నులు తగ్గాయి. ఇది వినియోగదారులకు ముఖ్యంగా మధ్యతరగతికి ఎంతో ఊరటను ఇచ్చే అంశమే. జీఎస్టీ కారణంగా సబ్బులు, టూత్‌పేస్ట్, హెయిర్ ఆయిల్, రేజర్లు, షాంపూ, డియోడోరెంట్ తదితర వస్తువులపై పరోక్ష పన్ను 26 శాతం (ఎక్సైజ్ ప్లస్ వ్యాట్) నుంచి 18 శాతానికి తగ్గిపోయింది.

జీఎస్టీతో మధ్యతరగతికి ఊరట
చెప్పుల ధరలు అయితే దాదాపు సగానికి తగ్గాయి. ఎంవోఎస్పీఐ కన్సంప్షన్ బాస్కెట్ డాటా ప్రకారం కేవలం నిత్యావసర వస్తువులే కాకుండా సుగంధ ద్రవ్యాలు, ధరలు కూడా ఆరు శాతం నుంచి ఐదు శాతం వరకు తగ్గాయి. ఇడ్లీ దోశ వంటివి 12 నుంచి 5 శాతానికి తగ్గాయి. రోటీ 12 నుంచి 5 శాతం, మినరల్ వాటర్ 27 నుంచి 18కి తగ్గాయి. అంతేకాదు, పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి కుటుంబం కలిసి లగ్జరీ ఆహారం కోసం వెళ్లడం ఖరీదైనదిగా కనిపించడం లేదు.

ఎన్నో వస్తువులపై రేట్లు తగ్గాయి
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత, కేంద్రం ధరలను ఖరారు చేసిన తర్వాత దాదాపు 33 శాతం వస్తువులు, సేవలపై రేట్లు తగ్గాయి. జీఎస్టీ కారణంగా భవిష్యత్తులో రెవెన్యూ పెరగనుంది. ఈ ఏడాది జూలై 27న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన సోషల్ మీడియా బ్లాగ్‌లో జీఎస్టీ గురించి పేర్కొన్నారు. గత ఏడాదిగా 384 వస్తువుల ధరలు తగ్గాయని, ఒక్క ఉత్పత్తి పైన పెరగలేదని చెప్పారు.

సామాన్యులకు తగ్గిన భారం, పెరిగిన రెవెన్యూ
అరుణ్ జైట్లీ ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ఇంత పెద్ద మొత్తంలో ట్యాక్స్ తగ్గింపు (జీఎస్టీ కారణంగా) స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ కనలేదని పేర్కొన్నారు. అదే సమయంలో ధరలు తగ్గుతూ, రెవెన్యూ పెరిగిందని, ఇది మంచి ఫలితమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జీఎస్టీ కారణంగా వచ్చే తగ్గింపుకు తోడు పండుగల సీజన్లలో రిఫ్రిజరేటర్లు, వాషింగ్ మిషన్లు, వాక్యూమ్ క్లీనర్లు, చిన్న టెలివిజన్లు తదితర వస్తువులపై 10 శాతం తగ్గింపుకు వస్తోంది. ఆ సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

జీఎస్టీ పరోక్ష పన్ను
జీఎస్టీ అనేది వస్తువులు, సేవలపై విధించిన పరోక్ష పన్ను. వినియోగదారుడు మినహా ప్రతి దశలో చెల్లించే పన్ను. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) ఐదు స్లాబ్‌లుగా ఉంది. 0%, 5%, 12%,18%, 28%గా ఉంది. పెట్రోలియమ్ ఉత్పత్తులు, అల్కాహాల్ (మద్యం), ఎలక్ట్రిసిటీ వంటివి జీఎస్టీ పరిధిలో లేవు. గతంలో వలె రాష్ట్ర ప్రభుత్వలు వాటిపై ట్యాక్స్ విధిస్తున్నాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications