వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వంలో ఇద్దరు, బయట మరో ఇద్దరీకే లాభం: వ్యవసాయ చట్టాలపై రాహుల్

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ వాయనాడు నియోజకవర్గంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. 100 ట్రాక్టర్లతో ర్యాలీ తీయగా.. వేలాది మంది రైతులు/ కూలీలు పాల్గొన్నారు. వాయనాడులో బఫర్ జోన్ ఎత్తేయాలని కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రాక్టర్‌ను రాహుల్ గాంధీ నడుపుతుండగా ఎడమ పక్కన ఎమ్మెల్యే ఐసీ బాలకృష్ణన్, కుడి పక్కన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూర్చొన్నారు.

ముందు రాహుల్ ట్రాక్టర్ రాగా.. మిగతా వాహనాలు అతనిని అనుసరించాయి. రాహుల్ వెంట భద్రత సిబ్బంది పరుగెత్తారు. దాదాపు 6 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ ర్యాలీ కొనసాగింది. చాలా మంది ప్రజలు రావడంతో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. థిరికయిపట్టు నుంచి ముట్టిల్లి వరకు ర్యాలీ కొనసాగింది. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇదీ అన్నదాతలను తీవ్రంగా నష్టానికి గురిచేస్తుందని రాహుల్ అన్నారు.

Huge turnout as Rahul Gandhi leads tractor rally at Wayanad

భారతీయ రైతుల ఇబ్బందులను యావత్ ప్రపంచం చూస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. కానీ ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం మాత్రం చూడటం లేదని చెప్పారు. దేశంలో ఉన్న 40 శాతం రైతులను వ్యవసాయ చట్టాలు నిర్మూలిస్తాయని హెచ్చరించారు. కొత్త చట్టాలతో మోడీ స్నేహితులకే మేలు జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వంలో ఇద్దరు (మోడీ, అమిత్ షా) బయట ఇద్దరు (అంబానీ, అదానీ) లాభపడుతున్నారని పేర్కొన్నారు. వారికే తప్ప అన్నదాతకు మేలు జరగడం లేదని వెల్లడించారు.

English summary
Congress leader Rahul Gandhi led a rally of over 100 tractors on Monday accompanied by thousands of farmers and labourers to protest against the new farm laws
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X