రిసార్టు నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, బీజేపీ ఫోన్, ఉలిక్కిపడిన నేతలు, గేట్!
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని బిడిది సమీపంలోని ఈగల్టన్ రిసార్టులో బసచేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరుతో హైడ్రామ చోటుచేసుకుంది. రిసార్టులో బసచేసిన హుమ్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ కారులో బయటకు రావడంతో కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడ్డారు.

బెళగావి లేడీ ఎమ్మెల్యేలు
బెళగావి జిల్లా కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు లక్ష్మీ హెబ్బాళ్కర్, అంజలి హెబ్బాళ్కర్ రిసార్టు నుంచి బయటకు వెళ్లిపోయారని తెలిసింది. కొంత సేపటికి హుమ్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ కారులో రిసార్టు నుంచి బయలుదేరారు.

పోలీసులకు ఫోన్
బెంగళూరు గ్రామీణ లోక్ సభ సభ్యుడు (కాంగ్రెస్) డికే. సురేష్ ఎమ్మెల్యే కారును అడ్డుకోవాలని గేట్ దగ్గర ఉన్న పోలీసులకు ఫోన్ చేసి చెప్పారని తెలిసింది. 10 నిమిషాల తరువాత కేజే. జార్జ్, ప్రియాంక్ ఖార్గే, డీకే. సురేష్ గేటు దగ్గరకు వెళ్లి రాజశేఖర్ పాటిల్ తో చర్చించారని సమాచారం.

బీజేపీ ఫోన్
కారులో అనంతరం బయటకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ తనకు అనారోగ్యంగా ఉందని ఆసుపత్రికి వెలుతున్నానని అన్నారు. రిసార్టు గేట్ దగ్గర తనను ఎవ్వరూ అడ్డుకోలేదని, బీజేపీ నాయకులు తనను సంప్రధించలేదని, ఫోన్ చెయ్యలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ వివరణ ఇచ్చారు.

బీజేపీ లీడర్స్ నిఘా
బిడిది సమీపంలోని రిసార్టులో బసచేసిన ఎమ్మెల్యేలు ఎవరెవరు బయటకు వస్తున్నారు అంటూ బీజేపీ నాయకులు నిఘా వేశారు. స్థానిక నాయకుల సహాయంతో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్న బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు వల వెయ్యడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications