మంచంపై మరొకరితో భార్య?: వెంట వెంటనే భర్తకు రెండు షాక్‌లు!

ఇది అక్రమ సంబంధం వ్యవహారమా?, భర్త ఇంట్లో లేని సమయంలో నిజంగానే అగంతకుడు వచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడా? అన్న కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ముంబై: అత్యాచారమా? లేక భర్తను మభ్యపెట్టే క్రమంలో ఆ ఆరోపణ చేసి ఉంటుందా?.. అన్న అనుమానాలు ఓ కేసు చుట్టు ముసురుకున్నాయి. భర్త ఇంటికి రావడం.. ఆ సమయంలో మరో వ్యక్తి భార్యతో కలిసి మంచంపై ఉండటం అతనికి అనుమానం కలిగేలా చేసింది.

ఇంతలో భర్తను చూసిన భార్య.. తనను రక్షించాలని కేకలు వేయడంతో.. మంచం మీద ఉన్న వ్యక్తి పరారయ్యాడు.ముంబైలోని ఢాఫరీ రోడ్డులో ఉన్న మలాద్ రెడిడెన్సీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మలాద్ రెసిడెన్సీలో చాలా కాలంగా ఒక వ్యాపారి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. భార్య(30), ఇద్దరు పిల్లలు, సోదరుడు, తల్లి, మామ, సోదరి అత్త.. అంతా కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు.

husband shocks after seeing wife with another in bedroom

ఇటీవల పని నుంచి రాత్రి వేళ ఇంటికి తిరిగొచ్చిన భర్త.. పడక గదిలో భార్యతో పాటు వేరే వ్యక్తి ఉండటం చూసి షాక్ తిన్నాడు. ఇంతలో అతని రాకను గమనించిన భార్య.. రక్షించాలంటూ కేకలు వేయడం అతనికి మరో షాక్‌లా అనిపించింది. వెంటనే తేరుకున్న భర్త తన అనుమానం సరికాదనకుని.. అతన్ని పట్టుకోవాలనుకున్నాడు. అయితే త్వరత్వరగా మంచం మీద ఉన్న బట్టలు తీసుకుని అతను పరారయ్యాడు.

తన సోదరుడి కుటుంబం ఇటీవలే ఉత్తరప్రదేశ్ వెళ్లిందని, భర్త వస్తాడన్న ఉద్దేశంతోనే తలుపు తీసి ఉంచానని, ఇంతలో వేరే వ్యక్తి ఎవరో తనపై అఘాయిత్యానికి ఒడిగట్టబోయారని సదరు వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్-376కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇది అక్రమ సంబంధం వ్యవహారమా?, భర్త ఇంట్లో లేని సమయంలో నిజంగానే అగంతకుడు వచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడా? అన్న కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+