కాన్పూర్‌లో బాలికపై ఘోరం, హైద్రాబాద్ రేప్‌ను ఖండించిన టీఎన్ఎస్ఎఫ్

నిందితుడు బాలిక పైన అత్యాచారయత్నం చేసిన సమయంలో ఆమె అడ్డుకుంది. దీంతో పక్కనే ఉన్న కిరోసిన్ తీసుకొని ఆమె పైన పోశాడు. అనంతరం అంటించాడు. బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చూసి ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
తాలాగ్రామ్ పోలీసు ఇంఛార్జ్ రంజేషన్ చౌహాన్ మాట్లాడుతూ.. తమ ఇంటికి దగ్గరలో ఉన్న వ్యక్తే తమ కూతురు పైన అత్యాచారయత్నం చేశాడని బాలిక తల్లిదండ్రులు చెప్పారన్నారు. సంఘటన జరిగినప్పుడు బాలిక తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇంట్లో లేరని చెప్పారు.
తనకు నిప్పు అంటించినప్పుడు బాలిక అరుస్తూ బయటకు వచ్చే ప్రయత్నాలు చేసింది. ఈ సమయంలో ఇంట్లో కూడా పలుచోట్ల నిప్పు అంటుకుంది. పొగలు రావడం గమనించిన చుట్టు పక్కల వారు వచ్చి ఆమెను రక్షించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ గ్యాంగ్ రేప్ పైన...
హైదరాబాదులోని పెద్ద అంబర్ పేటలో బాయ్‌ఫ్రెండ్‌ను బెదిరించి, యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన విషయం తెలిసిందే. నిందితులు శ్రీనివాస్ రెడ్డి, లింగారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్ రెడ్డి వెల్డర్ పని, లింగారెడ్డి మెకానిక్ పని చేసేవారిగా తెలుస్తోంది. ఈ అత్యాచారాన్ని పలువురు ఖండించారు.
హయత్‌నగర్‌లో యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను టీఎన్‌ఎస్‌ఎఫ్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి ఫెడరేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
-
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications