సినీ నటిగా గర్వపడుతున్నా, ఆ విమర్శలను పట్టించుకోను: జయాబచ్చన్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: సినీ నటి కావడంతో తాను ఎంతో గర్వపడుతున్నానని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ చెప్పారు.చిత్ర పరిశ్రమలో భాగమైనందుకు సంతోషంగా ఉందని జయాబచ్చన్ స్పష్టం చేశారు.

తనకు కాకుండా ఓ సినిమా డాన్సర్‌కు టిక్కెట్టు ఇవ్వడంపై నరేష్ అగర్వాల్ జయాబచ్చన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సమాజ్ వాదీ పార్టీ నుండి బిజెపిలో చేరారు. ఈ వ్యాఖ్యలపై జయాబచ్చన్ కౌంటర్ ఇచ్చారు ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె నరేష్ అగర్వాల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

సమాజ్ వాది పార్టీ తనను రెండో సారి రాజ్యసభకు ఎన్నుకోవడంపై ఆవిడ హర్షం వ్యక్తం చేశారు. పార్టీకి, పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఇతరులు తనపై చేసే కామెంట్లను తాను పట్టించుకోనని చెప్పారు.

I am proud to be an actor & to belong to film industry': Jaya Bachchan hits back at Naresh Agarwal

సమాజ్‌వాది పార్టీ మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందని ఆవిడ కొనియాడారు. తనకు రెండో సారి అవకాశం కల్పించడం కూడా మహిళల పట్ల సమాజ్‌వాది పార్టీకున్న ప్రాధాన్యమేనని ఆవిడ పేర్కొన్నారు. అయితే సమాజ్‌వాది మాజీ నేతైన నరేష్ అగర్వాల్ జయపై కామెంట్స్ చేయడం ఇది ఐదో సారి. ఈ విషయాన్ని గుర్తు చేసిన జయా గతంలోనూ ఇలాంటివి తాను పట్టించుకోలేదని గుర్తు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rajya Sabha MP and veteran actor Jaya Bachchan has said that she is "proud to be an actor and to belong to the film industry

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి