బీజేపీ ఎంపీపై పరువు నష్టం, నోటీసులు, నాతల్లి ముస్లీం, పాక్ వెళ్లిపోమంటావా ? ప్రకాష్ రాజ్ ఫైర్ !
బీజేపీ ఎంపీ మీద పరువునష్టం దావా వేసిన నటుడు ప్రకాష్ రాజ్నా కొడుకు చనిపోతే డ్యాన్సర్ తో పారిపోయాను అంటావా , ప్రకాష్ రాజ్ ఫైర్ నా తల్లి ముస్లీం అయితే పాక్ వెళ్లిపోవాలా, మోడీని ప్రశ్నిస్తే నా వ్యక్తిగత
బెంగళూరు: బహుబాష నటుడు, నిర్మాత, దర్శకుడు ప్రకాష్ రాజ్ బీజేపీ లోక్ సభ సభ్యుడి మీద పరువునష్టం దావా వేశారు. నా తల్లి ముస్లీం అయితే పాక్ వెళ్లిపో మంటావా అంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. తాను బీజేపీ ఎంపీ మీద పరువునష్టం దావా వేసింది డబ్బు కోసం కాదని, ఆయన బహిరంగంగా తనకు క్షమాపణ చెప్పాలనే అలా చేశానని ప్రకాష్ రాజ్ అన్నారు.
గురువారం బెంగళూరు ప్రెస్ క్లబ్ లో ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. తన వ్యక్తి గత విషయాలు సోషల్ మీడియాలో పెట్టిన మైసూరు-కొడుగు లోక్ సభ నియోజక వర్గం ఎంపీ ప్రతాప్ సింహా వెంటనే బహిరంగంగా తనకు క్షమాపణలు చెప్పాలని, సోషల్ మీడియాలో పోస్టు చేసిన అని వ్యాఖ్యలు తొలగించాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు.

లేదంటే బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మీద చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ప్రకాష్ రాజ్ హెచ్చరించారు. ఎంపీ ప్రతాప్ సింహా ప్రజాసేవకుడు అయి ఉండి కనీసం మంచి మర్యాద లేకుండా తనను విమర్శించాడని, ఇది ప్రజలందరికీ అవమానం అని ప్రకాష్ విచారం వ్యక్తం చేశారు.
కొడుకు చనిపోయిన వెంటనే ఓ డ్యాన్సర్ తో తాను వెళ్లిపోయాను అంటారా, ప్రధాని మోడీని విమర్శిస్తే ఇలా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతారా అని ప్రకాష్ రాజ్ ఎంపీ ప్రతాప్ సింహాను ప్రశ్నించారు. మోడీని బీజేపీ నాయకుడిగా తాను విమర్శించలేదని, ఆయన ప్రధాని హోదాలో ఉన్నారనే తాను ప్రశ్నించానని ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు.
తన తల్లి ఒక ముస్లీం అని, తాను పాకిస్ధాన్ వెళ్లిపోవాలని, నీ వ్యక్తిత్వం గురించి అందరికీ తెలుసు అంటూ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా తనను అవమానించారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. 10 రోజుల లోపు తనకు బీజేపీ ఎంపీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications