బీజేపీ కర్ణాటక సీఎం అభ్యర్థి: తండ్రి కోసం నియోజక వర్గం త్యాగం చేస్తున్న కుమారుడు!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు త్వరలో జరగనున్న సందర్బంగా బీజేపీ ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్. యడ్కూరప్ప అని ప్రకటించింది. బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడిగా ఉన్న యడ్యూరప్ప గత లోకసభ ఎన్నికల్లో ఎంపీ అయ్యారు.

నియోజక వర్గం
ఇప్పుడు బీఎస్ యడ్యూరప్ప ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాలి. బీఎస్ యడ్యూరప్ప పోటీ చెయ్యడానికి తన నియోజక వర్గం సీటును త్యాగం చేస్తానని ఆయన కుమారుడు, శివమొగ్గ జిల్లాలోని శికారిపుర నియోజక వర్గం ఎమ్మెల్యే బీవై. రాఘవేంద్ర చెప్పారు.

తండ్రి కోసం త్యాగం
హైకమాండ్ ఇప్పటికే బీఎస్. యడ్యూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఎమ్మెల్యే బీవై రాఘవేంద్ర అన్నారు. హైకమాండ్ ఎక్కడి నుంచి పోటీ చెయ్యమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని బీవై రాఘవేంద్ర వివరించారు.

పక్క జిల్లాకు
హావేరి జిల్లా రాణేబెన్నూరు ,బైందూరు నియోజక వర్గాల నుంచి పోటీ చెయ్యాలని చర్చ జరుగుతోందని, అయితే అంతిమ నిర్ణయం ఇంకా తీసుకోలేదని బీవై రాఘవేంద్ర చెప్పారు. మొత్తం మీద శికారిపుర నియోజక వర్గం నుంచి బీఎస్. యడ్యూరప్ప అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని రాఘవేంద్ర జోస్యం చెప్పారు.

అప్పుడే ప్రచారం
శికారిపురలో ఇప్పటికే బీఎస్. యడ్యూరప్పను గెలిపించాలని ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ప్రచారం మొదలు పెట్టారు. బీజేపీలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప తిరుగులేని నాయకుడు అని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.












Click it and Unblock the Notifications