వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్వపడేలా చేశారు: గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఫలితాలపై రాహుల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాను సంతృప్తిగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. సోమవారం ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం వైపు పయనిస్తోంది.

Recommended Video

షాకిచ్చే స్థాయికి కాంగ్రెస్.. ఆ ఇద్దరే ఆశలు నిలిపారు!

షాకిచ్చే స్థాయికి కాంగ్రెస్: ఆ ఇద్దరే ఆశలు నిలిపారు!షాకిచ్చే స్థాయికి కాంగ్రెస్: ఆ ఇద్దరే ఆశలు నిలిపారు!

తొలుత రెండు చోట్లా కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీగా ఉన్నాయి. అయితే క్రమంగా బీజేపీ బలం పుంజుకుని రెండు రాష్ట్రాల్లోనూ అధికారం చేపట్టే దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో సోమవారం పార్లమెంట్‌కు చేరుకున్న రాహుల్‌ గాంధీ.. ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలపై తాను సంతృప్తిగా ఉన్నానని చెప్పి లోపలికి వెళ్లిపోయారు. ఇది ఇలావుంటే.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందన్న ఆశతో మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఉదయం నుంచే కాంగ్రెస్‌ కార్యాలయంలో ఉండటం గమనార్హం.

సోనియాకి అహ్మద్ పటేల్‌లా: రాహుల్ వెనకుండి నడిపించేది ఈయనే, 'కాంగ్రెస్ చాణక్యుడు'సోనియాకి అహ్మద్ పటేల్‌లా: రాహుల్ వెనకుండి నడిపించేది ఈయనే, 'కాంగ్రెస్ చాణక్యుడు'

అయితే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తుండటంతో మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు నెమ్మదిగా కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. కార్యాలయంలో ఉన్న వారు ఫలితాల విషయమై మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీగా కనిపిస్తోంది. కాగా, రాహుల్ గాంధీ మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. ఆ పార్టీ నేత అంబికా సోనీ మాట్లాడుతూ తప్పులు ఎంచడం ఈ సమయంలో సరి కాదన్నారు. వాఘేలా వంటి నేతలు తమ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినా, ప్రస్తుతం తాము 75 స్థానాల్లో ముందంజలో ఉన్నామన్నారు.

స్వాగతిస్తున్నాం.. అభినందనలు

స్వాగతిస్తున్నాం.. అభినందనలు

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న పార్టీకి అభినందనలు తెలిపారు.

గర్వపడేలా చేశారు

గర్వపడేలా చేశారు

ఈ సందర్భంగా తనపై ప్రేమాభిమానాలు చూపించిన గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ప్రజలకు రాహుల్‌ కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్‌ సోదర, సోదరీమణులు తనను ఎంతో గర్వపడేలా చేశారని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న బలం ఏమాత్రం తగ్గలేదనే విషయాన్ని ప్రజలు నిరూపించారన్నారు.

నైతిక విజయం

నైతిక విజయం

గుజరాత్‌లో బీజేపీకి కాంగ్రెస్‌ గట్టి పోటీనే ఇచ్చింది. ఈ విషయంలో కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ..అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న రాహుల్‌కు దక్కిన నైతిక విజయం ఇదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ అభిప్రాయపడ్డారు. ఇది రాహుల్‌ ప్రచార విజయంగా గెహ్లాట్‌ అభివర్ణించారు.

కష్టపడాల్సి వచ్చింది..

కష్టపడాల్సి వచ్చింది..

ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో మోడీ, అమిత్‌షాలు 100 స్థానాలను గెలుచుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ మద్దతుతో గెలిచిన ఇద్దరు స్వతంత్య్ర అభ్యర్థులతో కలిపి కాంగ్రెస్‌ 82 స్థానాల్లో విజయం సాధించిందని, కానీ బీజేపీ మాత్రం 98-99 స్థానాలను సాధించేందుకు కష్టపడిందని కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా విమర్శించారు.

English summary
Congress Party president Rahul Gandhi on Monday said that he is satisfied with this assembly elections results of Gujarat and Himachal Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X