వివాదాస్పద ఒప్పందాలు: రాబర్ట్ వాద్రా సంస్థకు ఐటి శాఖ నోటీసులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు మరో ఎదురుదెబ్బ తగలింది. రాబర్ట్ వాద్రాకు సంబంధించిన వివాదాస్పద భూముల ఒప్పందాలు, ఆర్థిక వ్యవహారాలపై ఆదాయపన్ను శాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

2005-06 మధ్య కాలంలో స్థిరాస్తులు కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన ఒప్పందపు పత్రాలను సమర్పించాల్సిందిగా ఆదాయపన్ను శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఓ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్త పత్రిక కథనం ప్రకారం.. స్కై హాస్పిటాలిటి ప్రిన్సిపాల్ ఆఫీసర్‌కు ఐటి శాఖ నోటీసులు జారీ చేసింది.

I-T department issues notice to Robert Vadra’s firm Skylight Hospitality

అంతేకా, గత శుక్రవారం వాద్రాకు సమన్లు జారీ చేసింది. రియాల్టీ దిగ్గజం డిఎల్ఎఫ్ యునివర్సల్ లిమిటెడ్‌తో కలిసి పలు ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం.

తాము వేసిన 22 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా డిసెంబర్ 24న ఐటి శాఖ.. స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థను ఆదేశించింది. ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ.. డిఎల్ఎఫ్ యునివర్సల్ లిమిటెడ్, డిఎల్ఎఫ్ రిటైల్ డెవలపర్స్ లిమిటెడ్‌ల నుంచి స్వీకరించిన రుణాలకు సంబంధించిన వివరాలను అడిగినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+