సరిహద్దు ఉద్రిక్తత: తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను రంగంలోకి దించిన ఐఏఎఫ్
న్యూఢిల్లీ: చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నిఘాను పెంచుతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) అభివృద్ధి చేసిన రెండు లైట్ కొంబాట్ హెలికాప్టర్(తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు)లను సరిహద్దులో దించింది. సరిహద్దులో చైనా కుట్రలపై ఈ హెలికాప్టర్లు నిఘా పెట్టనున్నాయి.
Recommended Video
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిషన్స్‌కు ఈ శక్తివంతమైన హెలికాప్టర్లు అండగా నిలవనున్నాయి. హెచ్ఏఎల్ సీఎండీ ఆర్ మాధవన్ బుధవారం మాట్లాడుతూ.. ఈ హెలికాప్టర్లు ప్రపంచంలోనే తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా భారత భద్రతా దళాల అవసరాల మేరకు ఈ హెలికాప్టర్లను హెచ్ఏఎల్ రూపొందించిందని వివరించారు.
ఇటీవలే వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ హర్జిత్ సింగ్ అరోరా.. హెఏఎల్ టెస్ట్ పైలట్, వింగ్ కమాండర్(రిటైర్డ్) సుభాష్ పీ జాన్‌తో కలిసి ఎత్తైన ప్రాంతం నుంచి ఈ హెలిక్టాప్టర్‌లో ప్రయాణించారు. ఎత్తైన ప్రాంతాల నుంచి ఈ హెలికాప్టర్లు సమర్థవంతంగా దాడులు చేయగలవు.

ఈ హెలికాప్టర్లు అత్యంత ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో కూడా కార్యకలాపాలు సాగిస్తాయి. అంతేగాక, అనుకూలంగా లేని ప్రాంతాల్లో కూడా ఈ హెలికాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ కాగలవు. అంతేగాక, పగటి పూటనే కాకుండా రాత్రివేళలో కూడా ఈ శక్తివంతమైన హెలికాప్టర్లు నిర్దేశించుకున్న లక్ష్యాలపై ఆయుధాలతో దాడులు చేయగలవు.
కాగా, ఐఏఎఫ్, ఇండియన్ ఆర్మీకి సంయుక్తంగా 160 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల అవసరం ఉంది. ఈ క్రమంలో 15 లైట్ కంబాట్ హెలికాప్టర్ల ప్రారంభ బ్యాచ్ ప్రతిపాదనను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించింది. పర్యవసానంగా, 15 పరిమిత సిరీస్ ప్రొడక్షన్ (ఎల్‌ఎస్‌పి) హెలికాప్టర్లకు (ఐఎఎఫ్‌కు 10, ఆర్మీకి 5) ఐఎఎఫ్ ప్రతిపాదన (ఆర్‌ఎఫ్‌పి) జారీ చేసింది. ఇప్పటికే బెంగళూరులోని సంస్థ ఉత్పత్తిని ప్రారంభించింది.
మేలో ఐఏఎఫ్ సులూర్ వద్ద తేజస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) రెండవ పోరాట స్క్వాడ్రన్‌ను అమలు చేసింది.42 స్క్వాడ్రన్లు అవసరం ఉండగా ప్రస్తుతం ఐఏఎఫ్ వద్ద 42 మాత్రమే ఉన్నాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications