డీకే రవి ఆత్మహత్య కేసు: ఢిల్లీకి నివేదిక
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీ.కే. రవి ఆత్మహత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు నివేదిక తయారు చేసి ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపించారు. డీ.కే. రవి ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ కేసులో ఎవ్వరి ప్రమేయం లేదని సీబీఐ అధికారులు అంటున్నారు.
అయితే రవి ఆత్మహత్యకు కారణాలు మాత్రం అధికారులు గుర్తించలేకపోయారని తెలిసింది. నివేదికను పై అధికారులు పరిశీలించడానికి ఢిల్లీకి పంపించారు. రవి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగించాలా, వద్దా అనే విషయం పై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
రవి ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు బయటకు రావాలంటే దర్యాప్తు కచ్చితంగా జరగాలి. అయితే ఈ దర్యాప్తు కోనసాగించాలంటే కర్ణాటక ప్రభుత్వం లేదా, న్యాయస్థానం ఆదేశాలు జారీ చెయ్యవలసి ఉందని సీబీఐ అధికారులు అంటున్నారు.

వ్యక్తి గత కారణాలు, ఆర్థిక లావాదేవీల కారణంగా రవి ఆత్మహత్య చేసుకున్నాడని, నగదు వ్యవహారంలో రవిని ఆయన స్నేహితులు మోసం చేశారని సీబీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. రవి ఎలా మరణించాడు అనే విషయంపై సీబీఐ అధికారులు దర్యాప్తు పూర్తి చేశారు.
గతంలో విక్టోరియా ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టుం నివేదిక, ఫోరెన్సిక్ నివేదికలో రవి ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూసింది. ఇప్పుడు సీబీఐ అధికారులు సైతం రవి ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.
ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియాలంటే మళ్లి దర్యాప్తు చెయ్యాలి. అందుకు కర్ణాటక ప్రభుత్వం సీబీఐ కేంద్ర కార్యాలయానికి మనవి చెయ్యవలసి ఉంది. లేదా న్యాయస్థానం ఆదేశాలు జారీ చెయ్యవలసి ఉందని సీబీఐ అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications