ప్రేమలో పడ్డ ఐఎఎస్ అధికారులు.. ప్రేమికుల రోజునే పెళ్లి
బెంగళూరు : ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. విధి నిర్వహణలో బిజీబిజీగా ఉండే ఐఎఎస్ అధికారులు ప్రేమలో పడ్డారు. ప్రేమికుల రోజునే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన గౌతం.. కర్ణాటకలోని దావణగెరె జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. 2008లో సివిల్స్ పరీక్షల్లో నేషనల్ లెవెల్లో 23వ ర్యాంక్ సాధించారు. 2009 కర్ణాటక బ్యాచ్ ఐఎఎస్ అధికారిగా కొనసాగుతున్నారు.
దావణగెరె జిల్లాలోనే పనిచేస్తున్న ఐఎఎస్ అధికారిణి అశ్వథితో ప్రేమలో పడ్డారు గౌతం. జిల్లా పరిషత్ కార్యాలయం సీఈవో గా పనిచేస్తున్న అశ్వథి.. కేరళకు చెందినవారు. విధినిర్వహణలో భాగంగా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో వీరిద్దరు పనిచేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఇరువురి కుటుంబాల పెద్దలను ఒప్పించడంలో సఫలీకృతులయ్యారు. మరో ఐఎఎస్ అధికారి వీరి ప్రేమకు అండగా నిలిచి.. కుటుంబ సభ్యులతో పెళ్లికి ఓకే చెప్పించారు.

ఈనెల 14న వచ్చే ప్రేమికుల రోజున వీరి వివాహ జరగనుంది. కేరళలోని కాలికట్ లో ఈ ఇద్దరు ప్రేమికులు ఒక్కటి కానున్నారు. 17వ తేదీన గౌతం స్వగ్రామంలో విందు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications