• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ICYMI: మీరు చదవకపోతే, ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
యోగేంద్ర సింగ్ యాదవ్

ఈ వారం భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైన 5 కథనాలివి. మీరు ఇవి చదవకపోతే వెంటనే చదివండి.

1. కార్గిల్ యుద్ధం: "నా శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్‌ సైన్యం మీదకు గ్రెనేడ్ విసిరా"

అది 1999, జులై 3. టైగర్ హిల్‌పై మంచు కురుస్తోంది. రాత్రి తొమ్మిదిన్నరకు ఆప్స్ రూంలో ఫోన్ మోగింది.

కోర్ కమాండర్ జనరల్ కిషన్ పాల్.. మేజర్ జనరల్ మొహిందర్ పురీతో వెంటనే మాట్లాడాలంటున్నారని ఆపరేటర్ చెప్పాడు.

ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు మాటలు నడిచాయి. తర్వాత, 56 మౌంటెన్ బ్రిగేడ్ డిప్యూటీ కమాండర్ ఎస్‌వీఈ డేవిడ్‌తో "టీవీ రిపోర్టర్ బర్ఖా దత్, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారా, టైగర్ హిల్‌పై జరుగుతున్న కాల్పులపై ఆమె లైవ్ కామెంట్రీ ఇస్తోందా?" అని పురీ అడిగారు.

లెఫ్టినెంట్ జనరల్ మొహిందర్ పురీ ఆ రోజును గుర్తు చేసుకున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

రామ్‌చరణ్

2. రామ్‌చరణ్ తదుపరి జేమ్స్‌బాండ్ అవుతారా

జేమ్స్‌బాండ్ పాత్రకు తెలుగు సినీ నటుడు రామ్‌చరణ్ చక్కగా సరిపోతారని మార్వెల్ 'ల్యూక్ కేజ్' టెలివిజన్ సిరీస్ సృష్టికర్త చియో హోదరి కోకర్ అన్నారు.

గత ఏడాది వచ్చిన 'నో టైమ్ టు డై' చిత్రం తరువాత జేమ్స్‌బాండ్ పాత్ర నుంచి రిటైర్ అవుతున్నట్లు డేనియల్ క్రెయిగ్ ప్రకటించారు. దాంతో, తదుపరి జేమ్స్‌బాండ్ ఎవరన్న చర్చ మొదలైంది.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

5g

3. 5జీతో ఎలాంటి మార్పులు రానున్నాయి?

ఇండియాలో 5జీ నెట్‌వర్క్ కోసం స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ మొదలైంది. అసలు స్పెక్ట్రం అంటే ఏమిటి, అది ప్రజల రోజువారి కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేస్తుంది? 5జీ వచ్చాక 4జీ మనుగడ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం...

ఐఐటీ రోపార్‌కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సుదీప్త మిశ్రా 5జీ గురించి 'బీబీసీ'కి వివరించారు. ఆ విషయాలను ఈ కథనంలో తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

ఏ మేఘాల వల్ల వాన కురుస్తుంది

4. ఏ మేఘాల వల్ల వాన కురుస్తుంది... ఏవి ప్రమాదకరం?

వర్షాకాలంలో ఆకాశం వైపు చూస్తే- గుర్రపు తోకల్లా, డీప్ ఫ్రిడ్జ్‌లోని చిన్న చిన్న ఐస్ క్రిస్టల్స్‌లా, పాలు పొంగినప్పుడు గిన్నెపై ఏర్పడే నురగలా రకరకాల ఆకారాల్లో మేఘాలు కనిపిస్తుంటాయి.

అయితే, ఈ మేఘం అంత తొందరగా వర్షించేలా లేదు... ఈ లోపు ఆఫీసుకు వెళ్లిపోవచ్చేమో? నల్ల మబ్బులు కమ్ముకున్నాయి.. పొలానికి పొవాలా వద్దా? అదేదో తేలిపోయే రకం మబ్బులా ఉందే? ఇలాంటి సందేహాలు చాలా మందికే వస్తుంటాయి. ఈ ప్రశ్నలకు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వాతావరణ, సముద్ర గర్భ అధ్యయన విభాగం ప్రొఫెసర్ పి. సునీత సమాధానాలు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

భారతీయులు

5. లక్షలాది మంది భారతీయులు ఎందుకు భారత పౌరసత్వం వదులుకుంటున్నారు?

కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం... 2021లో 1,63,370 మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా వారు ఇండియా సిటిజెన్‌షిప్ వదులుకున్నట్లు పార్లమెంటుకు తెలిపింది.

భారత పౌరసత్వం తీసుకున్న వారిలో ఎక్కువ మంది అంటే 78,284 మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఆ తరువాత 23,533 మంది ఆస్ట్రేలియా, 21,597 మంది కెనడా పౌరులుగా మారారు.

ఇంతమంది భారత పౌరసత్వం వదులుకుంటున్నారు?

పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
ICYMI: If you haven't, here are the must-read articles this week
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X