ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాల జాబితా

1.చైనా 11 కి.మీ. లోతైన గొయ్యి తవ్వుతోంది, అక్కడ ఏముంది?
చైనా 11,100 మీటర్లకు పైగా లోతైన పెద్ద గొయ్యి తవ్వుతోంది.
తక్లమకాన్‌లో కిందటి వారం ఈ పనులు ప్రారంభమయ్యాయి.
వాయువ్య షిన్‌జియాంగ్ వీగర్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో ఉన్న తక్లమకాన్ ప్రపంచంలో అతిపెద్ద ఇసుకమేటలు ఉన్న రెండో ఎడారి.
ఈ గొయ్యి పది కంటే ఎక్కువ ఖండాంతర పొరల గుండా వెళుతుందని, భూమి అడుగున క్రెటేషస్ కాలం నాటి పొరలను తాకుతుందని ప్రభుత్వ మీడియా సంస్థ షిన్‌హువా తెలిపింది.
క్రెటేషస్ కాలం అంటే 14.5 కోట్ల సంవత్సరాల క్రితం మొదలై 6.6 కోట్ల సంవత్సరాల క్రితం ముగిసిన కాలం.
ఈ ప్రాజెక్ట్ సుమారు 457 రోజులు అంటే సుమారు ఏడాదిపైన మూడు నెలల్లో పూర్తవుతుందని, దీని కోసం 2,000 టన్నుల కంటే ఎక్కువ పరికరాలు, మెషినరీ ఉపయోగిస్తారని అంచనా.
అయితే ఈ గొయ్యిని చైనా ఎందుకు తవ్వుతోంది?
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఈజిప్ట్- గిజా పిరమిడ్-లో రహస్య సొరంగం, ఎలా బయటపడిందంటే..-
- రష్యా నుంచి చౌక చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్ పోటీ పడుతోందా-
2.రైలు ప్రమాదాల్లో చనిపోయినా, గాయపడినా ఇన్సూరెన్స్ పొందడం ఎలా? 10 ముఖ్యాంశాలు
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.
ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను రైల్వే శాఖ ప్రకటించింది.
తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత, రైలు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
రైలు ప్రయాణాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలాంటి లాభం ఉంటుంది?ప్రీమియం ఎంత చెల్లించాలి? ఏ సందర్భాల్లో ఇన్సూరెన్స్ వస్తుంది? ఎంత వస్తుంది?
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- తెలుగు ప్రజలతో కోరమండల్ ఎక్స్-ప్రెస్ అనుబంధమిది.-
- కోరమండల్ ఎక్స్-ప్రెస్- 'కవచ్’ అంటే ఏంటి, ఈ ఘోర ప్రమాదాన్ని అది ఆపగలిగేదా-

3.కారు వాడుతున్నారా? మీకోసమే ఈ తొమ్మిది టిప్స్
"నేను కనీసం 40 వేల కిలోమీటర్లు కూడా తిరగలేదు, అప్పుడే టైర్ మార్చమంటే ఎలా" అంటూ నిహారిక కారు షోరూం మెకానిక్‌తో గొడవ పడుతోంది.
"మీరు చెప్పేది కరెక్టే మేడం, కానీ ఆ టైర్లకు నాలుగేళ్లు దాటిపోయాయి, మార్చాల్సిందే" అంటూ ఆ షోరూం మెకానిక్ వాదన.
"మొన్న వర్షం పడుతున్నప్పుడు నేను ఏసీ అపితే, అలా చేయకూడదని చెప్పింది మా ఫ్రెండ్, వాడకపోయినా టైర్లు మార్చాల్సిందే అంటున్నాడు ఈ మెకానిక్, అసలు కారు గురించి నాకు చాలా విషయాలు తెలియదా ఏంటి?" అని తనలో తానే అనుకుంటూ షోరూం నుంచి బయటికి వచ్చింది నిహారిక.
నిహారిక లాగే, మనలో చాలా మందికి కారు వాడుతున్నా దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియకపోవచ్చు. అవేమిటనే దానిపై ఆటోమెబైల్ ఇంజినీరుగా 15 ఏళ్లు అనుభమున్న సత్యగోపాల్‌తో బీబీసీ మాట్లాడింది.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి... తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది
- డీజిల్ ఇంజిన్-ను హైడ్రోజన్ ఇంజిన్-గా మార్చే కొత్త టెక్నాలజీ..-

4.న్యూయార్క్ నగరం భూమిలోకి కుంగిపోతోంది, ఆపడం ఎలా?
1889, సెప్టెంబరు 27న న్యూయార్క్ ''టవర్ బిల్డింగ్''కు కార్మికులు తుది మెరుగులు దిద్దారు. 11 అంతస్తుల ఆ భవనమే ఇక్కడి తొలి ఆకాశహర్మ్యం. ఆ టవర్ బిల్డింగ్ ఇప్పుడు లేదు. కానీ, కొత్తతరం నిర్మాణ శైలికి ఆ భవనం నాంది పలికింది. నేటికీ ఆ ఆకాశహర్మ్యాల నిర్మాణ పరంపర కొనసాగుతోంది.
777 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని న్యూయర్క్ నగరంపై 762 మిలియన్ టన్నుల కాంక్రీటు, గాజు, ఉక్కుతో భారీ భవనాలు నిర్మించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) అంచనా వేసింది. అయితే, కాంక్రీటు విషయంలో ఇది ఒక అంచనా మాత్రమే.
ఇక్కడ పది లక్షల పైచిలుకు భవనాల్లోని ఫర్నీచర్‌లు, ఇతర ఫిట్టింగ్‌లు దీనిలో కలపలేదు. మరోవైపు ఈ భవనాలను కలిపే మౌలిక సదుపాయాలు, ఇక్కడ జీవించే 85 లక్షల మందిని కూడా ఈ లెక్కల్లో పరిగణలోకి తీసుకోలేదు.
ఇవన్నీ కలిపితే, న్యూయార్క్ నగరం నేలపై ఎంత విపరీతమైన ఒత్తిడి పడుతోందో తెలుస్తుంది. మే నెలలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఏడాదికి 1-2 మి.మీ. చొప్పున ఇక్కడి నేల కుంగడానికి భవనాల ఒత్తిడి కూడా ఒక కారణం.
ఇక్కడ సముద్ర మట్టం ఏడాదికి 3-4 మి.మీ. చొప్పున పెరుగుతోంది. ఇది అంత పెద్ద సమస్యగా మీకు అనిపించకపోవచ్చు. కానీ, కొన్ని ఏళ్లలో ఇదే ఈ తీర నగరానికి చాలా సమస్యలను తెచ్చిపెట్టొచ్చు.
పూర్తి కథనం చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
- జనాభాలో చైనాను దాటనున్న భారత్---కు పెను సవాళ్లు ముందున్నాయా -
- ఆంధ్రప్రదేశ్- ఏటా వేల మంది రాయలసీమ కూలీలు గుంటూరుకు ఎందుకు తరలివస్తున్నారు.-

5.తలనొప్పి: ఎన్ని రకాలు? ప్రమాదాన్ని సూచించే లక్షణాలు ఏవి?
తలనొప్పి అనేది దాదాపు అందరూ ఎదుర్కొనే ఆరోగ్య సమస్య. గణాంకాల ప్రకారం ఏటా ప్రతి నలుగురిలో ఇద్దరి నుంచి ముగ్గురు తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు.
వారిలో 30 శాతం మంది మైగ్రేన్ తలనొప్పి కోసం మందులు వాడతారు. ఆసుపత్రుల్లోని అత్యవసర విభాగానికి, అవుట్ పేషెంట్ విభాగానికి వచ్చే వారిలో తలనొప్పితో వచ్చే రోగులు ఎక్కువగా ఉంటారు.
తలనొప్పి ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి ప్రైమరీ తలనొప్పి, రెండోది సెకండరీ తలనొప్పి
ప్రైమరీ: ఇందులో తలనొప్పి రావడమే ప్రధాన సమస్య. ఒత్తిడి వల్ల 70 శాతం తలనొప్పి రాగా, మైగ్రేన్ తలనొప్పి 16 శాతంగా ఉంటుంది. ఈ రెండు రకాలను ప్రైమరీ తలనొప్పిగా భావిస్తారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- వందే భారత్ రైళ్లలో భద్రత ఎంత- అసలివి హైస్పీడ్ రైళ్లేనా..-
- హైదరాబాద్- కలెక్షన్లు తక్కువ తెచ్చారని ఫ్లెక్సీలతో కండక్టర్ల పరువు తీసిన ఆర్టీసీ
- సాదీ షిరాజీ- ఈ పర్షియన్ రచయిత సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి బ్రాహ్మణుడిగా మారారా- ఇది నిజమా, కల్పితమా-
- 'సహజీవనం చేస్తున్న మహిళ మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించాడు'
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications