Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాకు నా తండ్రి మద్య తేడా అదే, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే, నేను ముఖ్యమంత్రిని అవుతానో కానో

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచినా తాను ముఖ్యమంత్రిగా ఉంటానో ఉండనో తెలియదని అఖిలేష్ చెప్పారు. తన తండ్రి మల్లయోధుడని, తాను మాత్రం పుట్ బాల్ ప్లేయర్ నని చెప్పారు.

లక్నో :తన తండ్రికి తనకు మద్య తేడా ఉందని, త్వరలో ఉత్తర్ ప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించినా , తాను సిఎం అవుతానో లేనని ఉత్తర్ ప్రదేశ్ సిఎం అఖిలేష్ యాదవ్ చెప్పారు. తన తండ్రి నడిచిన దారిలోనే తాను నడవాలనే అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తండ్రి అడుగుజాడల్లోనే కొడుకులు నడవాలని అందరూ కోరుకొంటారు. అయితే తాను మాత్రం కొంత తేడా అందుకే ఆ దారిలో నడవడం లేదన్నారు.

తన తండ్రి మల్లయోధుడు, తండ్రి నడిచిన దారిలోనే నడవాలంటే తాను కూడ మల్లయోధుడిని కావాలి. కాని, తాను పుట్ బాల్ ప్లేయర్ ను అని ఆయన చమత్కరించారు.కొంత కాలంగా తండ్రి, కొడుకుల మద్య విబేధాలు బహిరంగంగానే కన్పిస్తున్నాయి. అయితే ఈ విబేధాలు మర్చిపోయినట్టు కుటుంబసభ్యులు, పార్టీ వర్గాలు ప్రకటించాయి. అయితే ఓ జాతీయ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేష్ తన అభిప్రాయాలను వివరించారు.

 పాఠాలు నేర్చుకొన్నా

పాఠాలు నేర్చుకొన్నా


ఇటీవలకాలంలో పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాలపై అఖిలేష్ స్పందించారు. ఈ పరిణామాల పట్ల తాను బాధపడ్డానని చెప్పారు.అయితే ఈ పరిణామాలతో తనకు మంచి అనుభవాలు వచ్చాయని చెప్పారు. అయితే ఈ పరిణామాలతో తాను గుణసాఠాలు నేర్చుకొన్నాని ఆయన అభిప్రాయపడ్డాడు.కష్టాల్లో ఉన్నప్పుడే ఆదుకొనేందుకు వచ్చినవారే నిజమైన స్నేహితులని ఆయన చెప్పారు. కొద్దిరోజులుగా పార్టీ లో చోటుచేసుకొన్న పరిమాణాలతో పాఠాలు నేర్చుకొన్నట్టు చెప్పారు.

 వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచినా ముఖ్యమంత్రిని అవుతానో కానో

వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచినా ముఖ్యమంత్రిని అవుతానో కానో

పార్టీలో ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించినా కాని, తాను ముఖ్యమంత్రిని అవుతానో కానో చెప్పలేనని ఆయన విస్పష్టం చేశారు. అయితే పరిస్థితులు అలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం పార్టీలో నెలకొన్న పరిణామాలను స్పష్టం చేస్తున్నాయి.

 అమర్ సింగ్ చిన్నాన్న

అమర్ సింగ్ చిన్నాన్న

పార్టీ నాయకుడు అమర్ సింగ్ తనకు చిన్నాన్న అని, యూపి ముఖ్యమంత్రి అఖిలేష్ చెప్పారు. అమర్ సింగ్ పై తాను వైఖరిని కుండబద్దలు కొట్టాడు. పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ కు తాను సలహా ఇచ్చేవాడినని, పార్టీకి ఇబ్బందికల్గించే పనులు చేసినందుకు గాను అమర్ పై చర్యలకు వెనుకాడబోనని ఆయన స్పష్టం చేశారు.అమర్ సింగ్ పార్టీలోకి తిరిగి రావడాన్ని ఆయన వ్యతిరేకించారు. కాని, ములాయం మాత్రం అమర్ సింగ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. అమర్ పున: ప్రవేశం కారణంగానే సమాజ్ వాదీ పార్టీలో ముసలం పుట్టిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

మాయావతి .. అక్కతో సమానం

మాయావతి .. అక్కతో సమానం

బిఎస్ పి అధ్యక్షురాలు తనకు అక్కతో సమానమని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బిఎస్ పితోనే తమకు ప్రధాన పోటీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అయితే బిఎస్ పి అధికారంలో ఉన్న కాలంలో చేపట్టిన అవినీతి కార్యక్రమాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఇంకా ప్రతి గ్రామంలో కన్పిస్తున్నాయనిఆయన చెప్పారు,.
మాయావతిని కలిసేందుకు వెళ్ళాలంటే చెప్పులు విడిచి వెళ్ళాల్సిన పరిస్థితులుున్నాయని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+