రెండే రెండు గంటల్లో మోదీ-అమిత్ షా-అదానిలను లోపలేస్తా: ఛాలెంజ్..!!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం నుంచి విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో సీబీఐ అధికారులు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన వ్యవహారం- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. మద్యం పాలసీని రూపొందించే విషయంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో- సీబీఐ రంగంలోకి దిగింది.

సీబీఐ విచారణ..

సీబీఐ విచారణ..

ఈ కేసులో ఆదివారం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారణకు పిలిపించారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకు విచారించారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తోన్నట్లు ప్రకటించారు. మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు సీబీఐ అధికారులు ముందు నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తోన్నారు. ఇదివరకే ఆయనను విచారించారు కూడా. మరోసారి మనీష్ సిసోడియాను విచారణకు పిలిపించారు సీబీఐ అధికారులు. అనంతరం అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఢిల్లీలో ఉద్రిక్తత..

ఢిల్లీలో ఉద్రిక్తత..

ఈ ఘటన తరువాత ఢిల్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనీష్ సిసోడియా అరెస్టుకు నిరసనగా ఆప్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సీబీఐ కార్యాలయం ముందు బైఠాయించారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆప్ శాసన సభ్యుడు సంజయ్ సింగ్ దీనికి సారథ్యాన్ని వహించారు. వారిని చెదరగొట్టే క్రమంలో పోలీసులు సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేశారు.

ప్రతిపక్షాలపైనే దాడులు ఎందుకు?

ప్రతిపక్షాలపైనే దాడులు ఎందుకు?

ఇవ్వాళ సంజయ్ సింగ్ ను పోలీసులు విడుదల చేశారు. బయటికొచ్చిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడి ఇంటిపై లేదా కార్యాలయాలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల ఇళ్లపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయని నిలదీశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం- తన అధికారాలన్నింటినీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.

అదాని అంశాన్ని పక్కదారి పట్టించడానికే..

అదాని అంశాన్ని పక్కదారి పట్టించడానికే..

గౌతమ్ అదాని లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక కుంభకోణాలకు పాల్పడ్డాడని, ఆయన గురించి ప్రశ్నించినందుకు బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తోందని సంజయ్ సింగ్ ఆరోపించారు. అదాని విషయంలో ఇప్పటివరకు నోరెత్తని ప్రధాని మోదీ- ఆ అంశాన్ని పక్కదారి పట్టించడానికే సీబీఐ, ఈడీలతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోన్నారంటూ ఆరోపించారు.

రెండే రెండు గంటల్లో..

రెండే రెండు గంటల్లో..

సీబీఐ, ఈడీలను తన చేతికి అప్పగిస్తే రెండు రెండు గంటల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గౌతమ్ అదానీలను సాక్ష్యాధారాలతో సహా అరెస్ట్ చేయిస్తానని అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించినందుకు, వాటిని కార్పొరేట్ కళాశాలకు ధీటుగా తీర్చిదిద్దినందుకు మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారాయ. సీబీఐ, ఈడీలు ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతోన్నాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+