నిర్మాతగా మారిన అల్లు అర్జున్ ఫ్రెండ్.. గ్రాండ్‌గా మూవీ లాంఛ్ !!
ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న మూవీ 'రాకా'. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ , రష్మిక మందాన కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గానే బన్నీ బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా టైటిల్ తో పాటు, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మూవీపై బజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లు అర్జున్.. గుండుతో, భారీ గోర్లు, బీస్ట్ స్టైల్ తో లుక్ ఉండడం అందరికీ షాక్ ఇచ్చింది.
కాగా ఇప్పుడు అల్లు అర్జున్ స్నేహితుడు సందీప్ రామినేని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 'మీరా ప్రొడక్షన్స్' పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన.. 'జోకర్' అనే టైటిల్‌తో తన తొలి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ సినిమాలో మౌర్య సిద్ధవరం, తన్వి ఆకాంక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గీతా సి.శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే సందీప్ రామినేని మాట్లాడుతూ.. దర్శకురాలు గీతా అద్భుతమైన కథను సిద్ధం చేశారని.. ఈ సినిమాపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. కాగా ఈ చిత్రానికి #AALoki #AA23 #LK7 వంటి వర్కింగ్ టైటిల్స్ చేయగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర గ్లింప్స్ షేర్ చేశారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ కానున్నట్లు తెలుస్తోంది.
Top-class entertainment begins with the blessings of TFI's finest! ❤️🔥@MeeraProdu1's Production No. 1, titled #Joker, was launched with an auspicious pooja ceremony in the presence of esteemed guests of honour.🤩
— BA Raju's Team (@baraju_SuperHit) June 27, 2026
Clap: Ace Producer #AlluAravind Garu
Camera Switch On: #AlluSneha… pic.twitter.com/5HoMIs8VO1












Click it and Unblock the Notifications