భారత్ పాక్ యుద్ధం జరిగితే.. పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్ల కెపాసిటీ ఇదే!
భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఏ సమయంలో వార్ మొదలవుతుందో అన్న ఉత్కంఠ రెండు దేశాలలోనూ చోటు చేసుకుంది. ఒకవేళ పాకిస్తాన్ తో భారత్ యుద్ధం మొదలైతే ఏం జరగబోతుంది అన్నది కూడా అంతే ఉత్కంఠకు కారణమవుతుంది.
పాకిస్తాన్ బలంపై షాకింగ్ న్యూస్
భారత్ తో యుద్ధానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ బలం ఎంత? పాకిస్తాన్ కి అండగా ఉన్న దేశాలు ఏమిటి? భారత్ తో తలపడి పాకిస్తాన్ నిలబడగలుగుతుందా? వంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఒక ఆంగ్ల వార్తా సంస్థ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.

పాకిస్తాన్ లో గుండ్ల నిల్వలు అతితక్కువ
భారతదేశంలో యుద్ధం మొదలైతే పాకిస్తాన్ వద్ద యుద్ధ ట్యాంకర్ల గుండ్లు కేవలం నాలుగు రోజుల్లోనే ఖాళీ అయిపోతాయని పేర్కొంది. పాకిస్తాన్ వద్ద శతఘ్ని గుండ్లు నిల్వలు ప్రస్తుతం అతి తక్కువ స్థాయిలో ఉన్నాయని సదరు వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ గుండ్లను తయారు చేయడానికి పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు నానా చావు చస్తున్నాయని పేర్కొంది.
ఉక్రెయిన్ కు యుద్ధ రిజర్వులను విక్రయించిన పాకిస్తాన్
అయితే ఉక్రెయిన్, రష్యా యుద్ధ సమయంలో, పాక్ యుద్ధ రిజర్వు లను చాలావరకు ఉక్రెయిన్ కు విక్రయించింది. దీంతో పాకిస్తాన్ వద్ద యుద్ధ రిజర్వులు చాలా తక్కువగా ఉన్నాయని ప్రస్తుతం ఉన్నవి కేవలం 96 గంటలకు మాత్రమే సరిపోతాయని నివేదిక వెల్లడించింది. కేవలం నాలుగు రోజుల్లో పాక్ యుద్ధ ట్యాంకర్ల గుండ్లన్నీ అయిపోతాయని పేర్కొంది.
యుద్ధ ట్యాంకర్ ల గుండ్ల ఉత్పత్తిని పెంచిన భారత్
ఇక మరోవైపు భారత్ మాత్రం యుద్ధానికి గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టు సదరు వార్తా సంస్థ పేర్కొంది. భారత్ కు చెందిన మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ తన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో యుద్ధ ట్యాంకర్ల గుండ్ల ఉత్పత్తిని భారీగా పెంచుతుంది. ఇప్పటికే అందులో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చిన సెలవులను అకస్మాత్తుగా రద్దు చేసి వెంటనే విధుల్లో చేరాలని కోరినట్లు ఆంగ్ల వార్త సంస్థ పేర్కొంది.
155 ఎంఎం గుండ్లను ఉక్రెయిన్ కు అమ్మేసిన పాక్
ప్రస్తుతం వచ్చే రెండు నెలల వరకు రెండు రోజుల ముందు సమాచారం లేకుండా ఎవరికి ఎటువంటి సెలవులు ఇచ్చేది లేదని పేర్కొంది. అయితే దీనిపైన అధికారికంగా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ వద్ద 155 ఎంఎం గుండ్లను ఉక్రెయిన్ కు ఎగుమతి చేసింది. భారత్ యుద్ధం చేయాలంటే పాక్ కు యుద్ధ ట్యాంకర్ల పనితీరు చాలా అవసరం.
బలహీనంగా పాక్ రక్షణా వ్యవస్థలు
ముఖ్యంగా ఎం 109 హోవిట్జర్లకు 155mm గుండ్లు, బిఎం 21 సిస్టమ్స్ కు 122 ఎంఎం రాకెట్లు చాలా అవసరం. పాకిస్తాన్ కు ముఖ్యంగా శతఘ్నులు, సెల్ఫ్ ప్రొపెల్ద్ గన్స్, ఎం జి ఎస్ వ్యవస్థల పనితీరు కీలకం. కానీ ఆ వ్యవస్థలు బలంగా లేకపోవడంతో భారతం యుద్ధం చేసే పాకిస్తాన్ ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.












Click it and Unblock the Notifications